ETV Bharat / offbeat

నూనెలో వేయించకుండానే "మెత్తటి పూరీలు" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - OIL FREE POORI RECIPE

- బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి బెస్ట్​ ఆప్షన్​!

Poori Without Oil
How To Make Poori Without Oil (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 2:23 PM IST

How To Make Poori Without Oil : చాలా మందికి పూరీలంటే ఎంతో ఇష్టం. వేడివేడి పూరీలను బ్రేక్​ఫాస్ట్​లో ఆలూ కర్రీతో తింటే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది. ఈ పూరీలకు చికెన్, మటన్​ కర్రీలు కాంబినేషన్​గా ఉంటే.. ఇంట్లో అందరూ గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు. అయితే, బరువు తగ్గాలనుకునే వారు, డైటింగ్​ చేసే వారు మాత్రం పూరీలకు దూరంగా ఉంటారు. దీనికి కారణం పూరీలను నూనెలో వేయించడమే.

అయితే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే నూనె లేకుండానే మృదువైన పొంగిన పూరీలను టేస్ట్​ చేయవచ్చు. నూనె లేకుండా పూరీలు చేయడం ఎలా? అని ఆలోచిస్తున్నారా ? ఈ స్టోరీ పూర్తిగా చదివితే మీకే క్లారిటీ వస్తుంది. మరి, ఇక లేట్​ చేయకుండా ఆయిల్​ ఫ్రీ పూరీలను చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానంపై ఓ లుక్కేయండి.

జీరో ఆయిల్ పూరీకి కావాల్సిన పదార్థాలు..

  • గోధుమ పిండి- కప్పు
  • పెరుగు-2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • నీరు-తగినంత

ఆయిల్ ​లెస్​ పూరీలను ఎలా చేయాలంటే ?

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్ లో గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • ఆపై పిండిలో పెరుగు వేసుకుని మరోసారి మిక్స్​ చేయాలి.
  • ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా అవసరమైనంత నీరు పోసుకుంటూ.. పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  • పిండి సాఫ్ట్​గా మిక్స్​ చేసిన తర్వాత బౌల్​పై మూత పెట్టి 20 నిమిషాలు అలా ఉంచాలి.
  • తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక పిండి ముద్దను చపాతీ పీటపై వేసి కాస్త మందంగా చపాతీ కర్రతో పూరీలు ప్రిపేర్​ చేసుకోవాలి. ఇలా అన్ని పూరీలను రెడీ చేసుకోవాలి.
  • ఆపై స్టౌపై గిన్నె పెట్టి 2 గ్లాసుల నీటిని పోయండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు పూరీలను వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.
  • పూరీలు నీటిపై తేలగానే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని పూరీలను వాటర్​లో కొద్దిసేపు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు పొడి వస్త్రంతో వాటర్​లో ఉడికించిన పూరీలపైన తేమను తుడుచుకోవాలి.
  • ఆపై ఎయిర్​ఫ్రైయర్​లో పూరీలను పెట్టాలి. వీటిని 180 డిగ్రీల వద్ద నాలుగు నిమిషాల పాటు కాల్చుకోవాలి.
  • అంతే.. ఇలా సింపుల్​గా చేసుకుంటే.. పూరీలు ఆయిల్​ లేకుండానే సూపర్​ టేస్టీగా రెడీ అవుతాయి.
  • ఈ వేడివేడి పూరీలను ఆలూ కర్రీతో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
  • ఆయిల్​ లెస్​ పూరీలు ​ మీకు నచ్చితే ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

కార్తికమాసం స్పెషల్​ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్​ సూపర్​ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్​!

ఇంట్లో చేసే పూరీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే హోటల్​ స్టైల్లో చక్కగా వస్తాయి, ఇంకా సూపర్ టేస్టీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.