ETV Bharat / offbeat

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్"​ చేసేసుకోండి - టేస్ట్​ సూపర్​!

-ఓట్స్​తో ఇడ్లీ, దోశ, ఉప్మానే కాదు.. -ఇలా రుచికరమైన ఆమ్లెట్​ కూడా చేసుకోవచ్చు

Oats Omelette Recipe
How to Make Oats Omelette Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 10:25 AM IST

How to Make Oats Omelette Recipe : ఇటీవల కాలంలో ఓట్స్​తో చేసిన బ్రేక్​ఫాస్ట్​ తినే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతిరోజు బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ, పూరి వంటివి తినడం కంటే.. కాస్త హెల్దీ ఫుడ్​ ట్రై చేయాలని ఓట్స్​ని డైట్​లో ఒక​ భాగం చేసుకుంటున్నారు జనాలు. అయితే, ఎప్పుడూ ఓట్స్​తో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి రెసిపీలు తినాలంటే బోర్​ కొడుతుంది. కాగా కాస్త వెరైటీగీ ఓట్స్​తో ఆమ్లెట్​ ప్రిపేర్​ చేయండి. ఓట్స్​తో ఆమ్లెట్​ కూడా వేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా ? అవునండీ.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఓట్స్​తో ఆమ్లెట్​ ప్రిపేర్​ చేస్తే ఎంతో రుచికరంగా వస్తుంది. ​ బ్రేక్​ఫాస్ట్​లో ఈ ఆమ్లెట్​ వేస్తే ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఓట్స్​ ఆమ్లెట్​ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • ఓట్స్​ -కప్పు
  • పాలు-సరిపడా
  • ఎగ్స్​ -మూడు
  • రుచికి సరిపడా ఉప్పు
  • మిరియాలపొడి -పావు టీస్పూన్​
  • ఉల్లిపాయ తరుగు -కొద్దిగా
  • క్యాప్సికం తరుగు-కొద్దిగా
  • టమాటా-1
  • పచ్చిమిర్చి-2
  • కొత్తిమీర తరుగు
  • క్యారెట్​ తురుము
  • నూనె సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఓట్స్​ తీసుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్​ చేసుకుని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోవాలి.
  • తర్వాత ఇందులో పాలు పోసుకుంటూ దోశల పిండిలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. (ఇక్కడ మీరు పాలకు బదులుగా నీళ్లు కూడా వాడుకోవచ్చు)
  • ఇప్పుడు ఒక గిన్నెలోకి ఎగ్స్​ పగలగొట్టి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి.
  • తర్వాత ఓట్స్​ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికం ముక్కలు, క్యారెట్​ తురుము వేసుకుని బాగా కలుపుకోవాలి.
  • అలాగే ఉప్పు వేసుకుని మిక్స్​ చేయాలి.
  • తర్వాత బీట్​ చేసుకున్న ఎగ్​ మిశ్రమం వేసి మిక్స్ చేయాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పాన్​ పెట్టి ఆయిల్​ వేయండి.
  • నూనె వేడయ్యాక ఓట్స్​ పిండి కాస్త మందంగా ఆమ్లెట్లా వేసుకోండి.
  • పాన్​పై మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోండి.
  • ఓట్స్​ ఆమ్లెట్​ రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే.. ఎంతో టేస్టీ అండ్​ హెల్దీ ఓట్స్​ ఆమ్లెట్లు మీ ముందుంటాయి.
  • నచ్చితే మీరు కూడా ఓట్స్​తో ఇలా ఆమ్లెట్​ ఓ సారి ట్రై చేయండి. బ్రేక్​ఫాస్ట్​లో పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే "జొన్న దిబ్బరొట్టెలు"- ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​ - షుగర్​ పేషెంట్స్​ హాయిగా తినొచ్చు!

హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ "మినప ఆవిరి కుడుములు"- బొంబాయి చట్నీ కాంబినేషన్​తో సూపర్​ టేస్ట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.