ETV Bharat / offbeat

అప్పటికప్పుడు తయారు చేసే "కమ్మటి ఉసిరికాయ చట్నీ"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది! - INSTANT AMLA PICKLE

-మార్కెట్లో విరివిగా ఉసిరికాయలు లభ్యం -ఈ విధంగా ఇన్​స్టంట్​ పచ్చడి ట్రై చేయండి

Instant Amla Pickle
How to Make Instant Amla Pickle (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2024, 11:17 AM IST

How to Make Instant Amla Pickle : ప్రస్తుతం మార్కెట్లో ఉసిరికాయలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ క్రమంలో.. చాలా మంది ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ప్రిపేర్​ చేసి పెట్టుకుంటారు. అయితే, ఉసిరికాయ పచ్చడి పెట్టాలంటే చాలా టైమ్ పడుతుందని కొంతమంది పచ్చడి పెట్టడానికి ఆసక్తి కనబరచరు. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే.. కేవలం నిమిషాల్లోనే ప్రిపేర్​ చేసే ఇన్​స్టంట్​ ఉసిరి పచ్చడి ఒకటి తీసుకొచ్చాం. ఈ విధంగా ఉసిరి చట్నీ తయారు చేస్తే టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి ఇక ఆలస్యం లేకుండా చేయకుండా ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • ఉసిరికాయలు-200 గ్రాములు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పసుపు-టీస్పూన్
  • ఎండుమిర్చి-12
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు -8
  • మెంతులు- అరటీస్పూన్
  • మినప్పప్పు-2 టేబుల్​స్పూన్లు
  • నూనె సరిపడా
  • ​కొద్దిగా నిమ్మరసం

తాలింపు కోసం..

  • ఆవాలు-టీస్పూన్
  • జీలకర్ర- అరటీస్పూన్
  • ఎండుమిర్చి-2
  • వెల్లుల్లి రెబ్బలు-3
  • చిటికెడు ఇంగువ
  • కరివేపాకు-1

తయారీ విధానం..

  • ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవండి.
  • తర్వాత ఉసిరికాయల్ని కత్తితో చిన్న ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేయండి. నూనె వేడయ్యాక ఉసిరికాయ ముక్కలు వేసి కలపండి. ఇందులో ఉప్పు, పసుపు వేసి మిక్స్​ చేయండి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉసిరికాయల్ని మగ్గించుకోండి. ఉసిరికాయలు మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అదే పాన్​లో టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేయండి. ఆయిల్​ వేడయ్యాక మెంతులు, మినప్పప్పు వేసి దోరగా వేపండి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఎండుమిర్చి వేగిన తర్వాత స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఈ మిశ్రమం మొత్తాన్ని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • తర్వాత వేపుకున్న ఉసిరికాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం పిండి మరొసారి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. (గ్రైండ్​ చేయడానికి వాటర్ ఉపయోగించవద్దు. నీరు వేస్తే పచ్చడి త్వరగా పాడైపోతుంది)
  • ఇప్పుడు తాలింపు కోసం.. పాన్​లో 3 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపండి. అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, ఇంగువ, కరివేపాకు వేసి కలపండి.
  • తాలింపు వేగిన తర్వాత గ్రైండ్​ చేసుకున్న ఉసిరికాయ మిశ్రమం వేసి బాగా మిక్స్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే.. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ. ఇలా పచ్చడి చేసి ఫ్రిడ్జ్​లో పెడితే 2 నెలలపాటు నిల్వ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఈ ఉసిరి చట్నీ ప్రిపేర్ చేయండి.

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "ఆమ్లా బర్ఫీ" - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు నిల్వ - టేస్ట్​ సూపరంతే!

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.