ETV Bharat / offbeat

రాత్రి అన్నం మిగిలితే రొటీన్ తాలింపేనా? - వెల్లుల్లి కారంతో ఇలా సూపర్ రెసిపీ చేయండి - టేస్ట్​ అద్దిరిపోతుంది!

- కొత్త పద్ధతిలో అన్నం - ఇలా చేసి పెడితే గిన్నె మొత్తం ఖాళీ!

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Garlic Fried Rice
How to Make Garlic Fried Rice (ETV Bharat)

How to Make Garlic Fried Rice : రాత్రివేళ అన్నం మిగిలిపోవడం ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. ఇదే అన్నం పొద్దున తినమంటే ఇంట్లో వాళ్లందరూ ముఖం చిట్లిస్తారు. అందుకే చాలా మంది మహిళలు తాలింపు అన్నం ప్రిపేర్​ చేసి పెడుతుంటారు. ఇలా చేస్తేనే అన్నం బయట పడేసే బాధ తప్పుతుంది. అయితే.. ఈ తాలింపు అన్నం ఒక్కోచోట ఒక్కో విధంగా చేస్తుంటారు. ఒకే పద్ధతి తెలిసిన వాళ్లు నిత్యం అదే చేస్తుంటే.. పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకే.. మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలతో సూపర్ టేస్టీగా ఉండే తాలింపు అన్నం ప్రిపేర్ చేద్దాం.

ఈ కొత్త పద్ధతిలో ప్రిపేర్ చేసే ఫ్రైడ్​ రైస్​ తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు. మరి ఇక లేట్​ చేయకుండా ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం ఫ్రైడ్​ రైస్​ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం
  • వెల్లుల్లి రెబ్బలు-12
  • కారం -చెంచా
  • నూనె-టేబుల్​స్పూన్​
  • జీలకర్ర-అరటీస్పూన్​
  • ఆవాలు-అరటీస్పూన్​
  • పసుపు-చిటికెడు
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • కరివేపాకు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కొత్తిమీర

తయారీ విధానం..

  • ముందుగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత రోటిలో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా దంచుకోండి. అయితే.. ఈ వెల్లుల్లి కారం మిశ్రమం సిద్ధం చేస్తున్నప్పుడు నీళ్లు పోసుకోకూడదు.
  • ఇప్పుడు వెల్లుల్లి కారం ముద్దని అన్నంలో వేసుకోండి. కారం పూర్తిగా రైస్​కి పట్టేలా చేతితో బాగా కలుపుకోండి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్​ చేసి పాన్​ పెట్టండి. ఇందులో ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • ఆయిల్​ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించండి.
  • ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి ఫ్రై చేయండి.
  • ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వెల్లుల్లి కారం అన్నం వేసి బాగా కలపండి.
  • అంతే.. ఎంతో రుచికరమైన తాలింపు అన్నం ఇంత ఈజీగా సిద్ధమైపోతుంది. ఈ రెసిపీకి చివర్లో కాస్త కొత్తిమీర చల్లుకుంటే రుచి మరింత బాగుంటుంది.
  • దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా మిగిలిపోయిన అన్నంతో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన "పల్లీల రైస్"​ - పిల్లల లంచ్ బాక్స్​లోకి పర్ఫెక్ట్​ రెసిపీ!

క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్​ రైస్​"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.