How to Book Rooms in Sabarimala by Online : దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అత్యంత ప్రసిద్ధ, ఆధ్యాత్మిక, పురాతన యాత్ర స్థలాల్లో ఒకటిగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ మహిమాన్విత ఆలయం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పెరియార్ టైగర్ రిజర్వ్ లోపల ఆభయారణ్యంలో ఉంది. ఏటా కార్తిక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి దీక్ష కొనసాగుతోంది. ధర్మశాస్త్ర నిబంధనల ప్రకారం 41 రోజులు భక్తులు మాలలు ధరించి నియమనిష్ఠలతో స్వామిని ఆరాధించి... చివరి రోజు ఇరుముడితో అయ్యప్ప దర్శనార్థం శబరిమల కొండకు బయలుదేరుతారు.
ఈ క్రమంలోనే సుదూర ప్రాంతాల నుంచి బయలుదేరే భక్తులు ముందే ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారు. దీనికి ఫొటో, ఆధార్ కార్డు సరిపోతుంది. కానీ, అక్కడ ఎలాంటి గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లు ఉండవు. దీంతో.. శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.. భక్తులకు గదుల రూపంలో బస కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. శబరిమలకు కుటుంబ సభ్యులతో వెళ్లే యాత్రికుల కోసం ట్రావెన్కోర్ బోర్డు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ముందుగానే గదులను బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే.. చాలా మంది భక్తులు గదులకు ఈ విషయం తెలియక అక్కడికి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ పరిస్థితి రాకుండా.. ముందుగానే ఇలా రూమ్ బుక్ చేసుకోండి.
శబరిమల గదిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఇలా..
- మొదట ఆన్లైన్ రూమ్ బుక్ చేసుకోవడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధికారిక వెబ్సైట్ www.onlinetdb.com ని సందర్శించాలి.
- మొదటిసారి టికెట్ బుక్ చేసుకునేవారు సైన్ ఇన్ పై క్లిక్ చేసి.. రిజిస్టర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత లాగిన్ డీటెయిల్స్‌తో.. ఎంటర్ కావాలి.
- లాగిన్ తర్వాత మీకు అప్లికేషన్ ఫారమ్ కనిపిస్తుంది.
- ఇప్పుడు శబరిమలలో గదులు అందుబాటులో ఉన్నాయో లేదా సెర్చ్ చేయాలి.
- గదులు ఉంటే లాగిన్ అయి.. మీ పేరు, ఎన్ని రోజులు ఉంటారు ఇలా అడిగిన వివరాలు నమోదు చేయాలి.
- అందుకు అవసరమైన ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
- ఈ విధంగా మీరు శబరిమల అయ్యప్పస్వామి సన్నిధిలో గదులను ఆన్‌లైన్‌లో సులభంగా బుక్ చేసుకోవచ్చు.
భక్తులు తెలుసుకోవాల్సిన విషయాలు..
- శబరిమలలో గది బుక్ చేసే సమయంలో దానికి తగిన అద్దె చెల్లించాలి.
- అలాగే గదిని బుక్ చేస్తున్నప్పుడు తగిన చెక్-ఇన్ స్లాట్ రూమ్‌లను ఎంచుకోవాలి.
- మీరు గది బుకింగ్ సమయంలో అందించిన ఫొటో, ఐడీ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- గదిలో ఎంత మంది ఉంటారన్నది బుకింగ్ సమయంలోనే పేర్కొనాలి. అలా కాకుండా.. ఎక్కువ మంది వెళ్తే.. ప్రతి అదనపు వ్యక్తికి డబ్బు చెల్లించాలి.
శబరిమల ప్రసాదం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? - అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!
అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?