These Household Chores Burn Belly Fat : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకునేందుకు.. కొన్ని ఇంటి పనులు చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గార్డెనింగ్ : మీ రోజువారి ఇంటి పనులలో తప్పనిసరిగా గార్డెనింగ్ ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. ఇది ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందని సూచిస్తున్నారు. పొట్ట కొవ్వును కరిగించడానికి సహాయపడుతుందంటున్నారు. మొక్కల కోసం పాదులు తవ్వడం, మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులు చేస్తున్నప్పుడు కిందకు వంగుతుంటారు. దీనివల్ల పొత్తికడుపులోని ప్రధాన కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుందని చెబుతున్నారు. కాబట్టి.. గార్డెనింగ్(National Library of Medicine) వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గడంతో పాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు.
2013లో "జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్ "లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. తోట పని చేయడం.. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి కొంతమేర సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో Middle Tennessee State Universityలో హెల్త్ అండ్ హ్యూమన్ డిపార్ట్ మెంట్లో ప్రొఫెసర్ డాక్టర్ Tai-Chung Ting పాల్గొన్నారు.
కనీసం డైలీ ఈ ఒక్క వ్యాయామం చేసినా చాలు - మీ శరీరంలో అద్భుతం జరుగుతుంది!
మాపింగ్ : ఇది కూడా పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు. అంటే.. మీరు ఇంటి ఫ్లోర్ తుడుస్తున్నప్పుడు(మాపింగ్) మీ కోర్ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుందని చెబుతున్నారు. ఫలితంగా కొన్ని కేలరీలు ఖర్చు అవుతాయి. కాబట్టి మాపింగ్ కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. దీనివల్ల ఇల్లు శుభ్రంగా, ఒళ్లు ఆరోగ్యంగా ఉంటుందని సూచిస్తున్నారు.
బాత్రూమ్ క్లీనింగ్ : మీరు బాత్రూమ్ క్లీనింగ్‌లో భాగంగా గోడలను స్క్రబ్బింగ్ చేయడం, నేలను తుడుచుకోవడం, బేసిన్, కమోడ్‌లను శుభ్రపరచడం.. వంటివి చేసినప్పుడు మీ కోర్, కాళ్లు, చేతుల కండరాలకు మంచి ఎక్సర్ సైజ్ లభిస్తుంది. ఫలితంగా కొంతమేర కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి.. బాత్రూమ్ క్లీనింగ్ కూడా పొట్ట కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
బట్టలు ఉతకడం : ఇక బట్టలు ఉతకడం అనేది అద్భుతమైన వ్యాయామం. వాషింగ్ మెషీన్స్ బదులు.. మీరే స్వయంగా ఉతికితే పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. ఉతకడం దగ్గర నుంచి నీటిలో జాడించి, ఎండేయడం వరకు చేస్తే.. వంగడం, పైకి లేవడం వల్ల భారీగా కేలరీలు కరిగిపోతాయని చెబుతున్నారు. అప్పుడు పొట్టపై పడే ఒత్తిడితో కొవ్వు కరిగిపోతుందని చెబుతున్నారు.
తలుపులు, కిటికీలను శుభ్రపరచడం : ఇది కూడా శరీరానికి మంచి వ్యాయామంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఈ తేలికపాటి వ్యాయామం మిమ్మల్ని చురుకుగా ఉంచడంతోపాటు బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడానికి దోహదపడుతుందని చెబుతున్నారు. వీటితో పాటు.. డైలీ వాకింగ్, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం ఫిట్ నెస్ సెంటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.