ETV Bharat / offbeat

తిన్నా కొద్దీ తినాలనిపించే "దాల్ పక్వాన్" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్! - DAL PAKWAN RECIPE

డైలీ దోశ, ఇడ్లీ, బోండా తినాలంటే బోరింగ్​గా ఉందా? - అయితే, ఈ స్పెషల్ బ్రేక్​ఫాస్ట్ రెసిపీపై ఓ లుక్కేయండి!

HOW TO MAKE DAL PAKWAN
Dal Pakwan Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 14, 2024, 5:09 PM IST

Dal Pakwan Recipe in Telugu : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ, బోండా, పూరీ, చపాతీ వంటివి ప్రిపేర్ చేసుకుంటుంటాం. అయితే, రొటీన్​గా ఎప్పుడూ ఒకేరకమైన టిఫెన్స్ తినాలంటే ఎవరికైనా బోరింగ్​గా అనిపిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఏరోజుకారోజు వెరైటీ టిఫెన్ ఉండాలని కోరుకుంటారు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "దాల్ పక్వాన్". సూపర్ టేస్టీగా ఉండే దీన్ని ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. మరి, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

పప్పు కోసం :

  • నూనె - తగినంత
  • శనగపప్పు - 1 కప్పు
  • పసుపు - పావుటీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 3
  • ఆమ్​చూర్ పొడి - అరటీస్పూన్
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • మిరియాల పొడి - పావుటీస్పూన్
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్

పిండి కోసం :

  • వాము - అరటీస్పూన్
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • గోధుమ పిండి - అర కప్పు
  • మైదా పిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో శనగపప్పును 1 గంటపాటు నానబెట్టుకోవాలి. అనంతరం ప్రెషర్ కుక్కర్​లో 1 టేబుల్​స్పూన్ నూనె, నానబెట్టుకున్న శనగపప్పును వాటర్ వడకట్టి వేసుకొని 3 కప్పుల వాటర్ పోసుకోవాలి.
  • అలాగే.. పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పు ఉడికేలోపు పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్​లో అరకప్పు వాటర్, కాస్త చేతితో నలిపిన వాము, నూనె, ఉప్పు వేసి సాల్ట్ నీటిలో కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి.
  • తర్వాత అందులో ముందుగా గోధుమ పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై మైదా పిండిని వేసుకొని మరోసారి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని గట్టిగా, దగ్గరగా పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఆపై పిండిపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అరగంటపాటు అలా వదిలేయాలి.
  • ఇప్పుడు ప్రెషర్​ కుక్కర్​లో ఉడికించుకున్న పప్పును స్టీమ్ పోయాక మూతతీసి సగం పప్పును మాష్ చేసుకోవాలి. అనంతరం ఆ కుక్కర్​ను మళ్లీ స్టౌపై పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో ఆమ్​చూర్ పొడి, వేయించిన జీలకర్ర పొడి, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
  • అనంతరం స్టౌ మరో బర్నర్​ మీద చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్​స్పూన్ల ఆయిల్, 1 టేబుల్​స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి ఆయిల్ వేడక్కాక అందులో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వాలి.
  • జీలకర్ర చిట్లి చిటపటమంటున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని.. అరటీస్పూన్ కశ్మీరీ కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని స్టౌ మీద ఉడికించుకుంటున్న శనగపప్పు మిశ్రమంలో వేసి కలుపుకుంటే చాలు. రెసిపీలోకి కావాల్సిన పప్పు రెడీ!
  • ఇక ఇప్పుడు పక్వాన్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కలిపి చిన్న చిన్న ఉండలుగా డివైడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత చపాతీ పీటపై కొద్దిగా పొడిపిండిని చల్లుకొని పిండి ఉండలను చపాతీ రోలర్​ సహాయంతో పూరీలా మాదిరిగా వత్తుకోవాలి. పూర్తి రౌండ్ షేప్ రావాలనుకుంటే ఆ షీట్ మీద ప్లేట్​తో వత్తుకొని మిగతా పిండిని తీసేసుకుంటే సరిపోతుంది.
  • ఆపై టూత్ పిక్ లేదా ఫోర్క్ స్పూన్​తో మీరు ప్రిపేర్ చేసుకున్న పూరీ షీట్​ మొత్తం పిక్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని డీప్ ​ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని వేడిచేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మీరు రెడీ చేసుకున్న పక్వాన్ వేసుకొని.. మీడియం ఫ్లేమ్​ మీద క్రిస్పీగా, గోల్డెన్ కలర్​లోకి మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్​లోకి ఒక పక్వాన్ తీసుకొని దాని మీద ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పును ఒక గరిటెడు వేసుకోవాలి. దానిపైన కొంచం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి తరుగుతో పాటు కాస్త పుదీనా చట్నీ, టమాటా సాస్​తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "దాల్ పక్వాన్" రెడీ!

ఇవీ చదవండి :

పప్పు రుబ్బకుండా 5 నిమిషాల్లో నోరూరించే 'బ్రెడ్ ఊతప్పం' చేసుకోండిలా! - దోశను మించిన టేస్ట్!!

హోటల్ స్టైల్ "దహీ వడ" - ఇంట్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.