ETV Bharat / offbeat

టేస్టీ "కొత్తిమీర పులావ్​" - ఇలా చేసి పెడితే పిల్లల లంచ్​బాక్స్​లు ఇట్టే ఖాళీ అయిపోతాయ్​! - HOW TO MAKE CORIANDER PULAO

-రెగ్యులర్​ పులావ్​ను మించిన టేస్ట్​ -ఇలా చేసి పెడితే పిల్లలు ఒక్క మెతుకు మిగల్చరు!

How to Make Coriander Pulao
How to Make Coriander Pulao (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 9:23 AM IST

How to Make Coriander Pulao: పులావ్.. చాలా మంది ఫేవరెట్​ డిష్​. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రకరకాలుగా చేసుకుంటుంటారు. కూరగాయలతోపాటు మటన్, చికెన్ లాంటి నాన్ వెజ్​లతోనూ పులావ్ చేసుకుంటుంటారు. అంతేనా.. కూరగాయలు లేనప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు, పిల్లలు లంచ్​ బాక్స్​లు తిననప్పుడు వెరైటీగా చేస్తుంటారు. మరి, ఈసారి కూడా వెరైటీగా చేయాలనుకుంటున్నారా? అయితే ఎంతో టేస్టీగా, నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే కొత్తిమీర పులావ్​ను రెడీ చేసుకోండిలా. రుచి అద్దిరిపోతుంది. కలర్​ఫుల్​గా ఉండటం వల్ల పిల్లల లంచ్​ బాక్స్​కి పెడితే మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. మరి ఈ పులావ్​కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • అల్లం - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • పచ్చిమిర్చి - 3
  • కొత్తిమీర తరుగు - 1 కప్పు
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • బిర్యానీ ఆకు - 1
  • లవంగాలు - 3
  • యాలకులు - 3
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • నీళ్లు - 4 కప్పులు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • గరం మసాలా -1 టీ స్పూన్​
  • బియ్యం - 2 కప్పులు
  • జీడిపప్పు - 10
  • కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే జీడిపప్పును నెయ్యిలో వేయించి పక్కన ఉంచాలి. అదే విధంగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్​ తీసుకుని అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి కుక్కర్​ పెట్టి ఆయిల్​ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాసపువ్వు వేసి ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత కట్​ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించుకోవాలి.
  • అనంతరం ముందుగానే ప్రిపేర్​ చేసుకున్న అల్లం కొత్తిమీర పేస్ట్​ వేసి నూనె పైకి తేలేవరకు మగ్గించుకోవాలి.
  • నూనె పైకి తేలిన తర్వాత నాలుగు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి.
  • నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యాన్ని వేసి కలిపి కుక్కర్​ మూత పెట్టి మీడియం ఫ్లేమ్​ మీద రెండు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత కుక్కర్​ స్టీమ్​ పోయేవరకు ఉంచి అనంతరం ఓపెన్​ చేసి వేయించిన జీడిపప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపి వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే అద్దిరిపోయే కొత్తిమీర పులావ్​ రెడీ.
  • నచ్చితే మీరూ ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. ఈ రెసిపీని పిల్లల లంచ్​ బాక్స్​లో పెడితే కిక్కురుమనకుండా తినేస్తారు.

కార్తికమాసం స్పెషల్ - ఆంధ్ర స్టైల్​ "పనసపొట్టు పులావ్" - మటన్ బిర్యానీని మించిన టేస్ట్​!

కార్తిక మాసం స్పెషల్​ "ఆలూ పులావ్​, వంకాయ మసాలా " - ఇలా చేస్తే ఒక్క మెతుకు వదలకుండా ఇష్టంగా తింటారు!

సండే స్పెషల్ - ఘుమఘుమలాడే "మటన్ పులావ్" - నిమిషాల్లో సింపుల్​గా ప్రిపేర్​ చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.