Ukraine Russia War : ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై భీకర దాడి జరిగింది. ఓ బేకరిపై జరిగిన దాడిలో ఒక చిన్నారి సహా 28 మంది మరణించినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ దాడి లుహాన్స్క్ ప్రాంతంలోని లిసిచాన్స్క్ నగరంలోని శనివారం జరిగింది. శిథిలాల కింది చిక్కకున్న మరో 10 మందిని కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది ఉక్రెయిన్ బలగాల పనేనని ఆరోపించారు.
మరోవైపు రష్యా దళాలు సుమీ ప్రాంతంలో 16 చోట్ల దాడులు చేశాయని ఉక్రెయిన్ సైన్యాధికారులు పేర్కొన్నారు. అలానే సుమీ ప్రాంతంలో సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్న రష్య నిఘా వర్గాలు, బలగాలను కీవ్ దళాలు అడ్డుకున్నట్లు తెలిపారు. గత నెలలోనూ డొనెట్స్క్‌లోని ఓ మార్కెట్‌పై జరిగిన క్షిపణి దాడిలో 27 మంది మృతి చెందారు. ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లవుతున్నా, పరిస్థితులు ఏ మాత్రం సద్దుమణగడం లేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల పేర్కొన్నారు.
రష్యాను హెచ్చరించిన జెలెన్‌స్కీ
Russia Ukraine War Zelensky : రష్యాతో జరుగుతున్న ఘర్షణలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు. అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతిస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని చెప్పారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ కూడా తెలుసు అని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే మరో ప్రపంచ యుద్ధం తప్పనిసరి అని అన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.
జర్మనీ నుంచి టారస్ క్రూజ్ క్షిపణలు అందకపోవటంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ అన్నారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాల బలహీనతలను తాను కూడా అర్థం చేసుకోగలనని తెలిపారు. అయితే యుద్ధం సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదు అని అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఉక్రెయన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు. పూర్తి కథనం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
కుప్పకూలిన రష్యా మిలటరీ విమానం- యుద్ధ ఖైదీలు సహా 74మంది మృతి
ఉక్రెయిన్ రివెంజ్- రష్యన్ సిటీపై భీకరదాడి- 14మంది మృతి, 108మందికి గాయాలు