Britain Assisted Dying : ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వయోవృద్ధులు తమ జీవితాలను ముగించేందుకు (మరణించేందుకు) అనుమతించే బిల్లుకు బ్రిటన్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వాస్తవానికి సుదీర్ఘ చర్చ అనంతరం, మెజార్టీ చట్టసభ సభ్యులు ‘అసిస్టెడ్ డయ్యింగ్ బిల్లు’కు మద్దతుగా ఓటు వేశారు. దీంతో పార్లమెంటులో తదుపరి పరిశీలనకు ఈ బిల్లు వెళ్లనుంది. అయితే, 2015లో తొలిసారిగా ఇటువంటి బిల్లును తెచ్చినప్పటికీ, పార్లమెంటు ఆమోదం పొందడంలో అప్పుడు విఫలమైంది.
ఇది పరిష్కారం కాదు!
బ్రిటన్ తీసుకువస్తోన్న ఈ బిల్లుపై అక్కడి ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై చట్టసభ సభ్యులు చర్చిస్తోన్న సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే, మద్దతిచ్చే వర్గాలు పార్లమెంటు బయట ప్లకార్డులు చేతపట్టి తమ వాదనను వినిపించే ప్రయత్నం చేశారు. అయితే చివరకు మెజార్టీ ఎంపీల మద్దతుతో ఈ బిల్లు సూత్రప్రాయ ఆమోదం పొందింది.