British Indian MPs In UK Elections : బ్రిటన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ పార్లమెంట్‌కు గతంలో కంటే ఎక్కువ మంది భారత సంతతికి చెందిన ఎంపీలు ఎన్నికయ్యే అవకాశం ఉందని 'బ్రిటీష్ ఫ్యూచర్' అనే సంస్థ అంచనా వేసింది. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత వైవిధ్యమైన పార్లమెంట్‌ను అందించనున్నాయని పేర్కొంది. లేబర్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిస్తే, అందులో ఎక్కువ మంది మైనారిటీలు ఉంటారని తెలిపింది.
ఈసారి జరిగే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో 14 శాతం మంది మైనారిటీ ఎంపీలు గెలుస్తారని బ్రిటిష్ ఫ్యూచర్ డైరెక్టర్ సుందర్ కట్వాలా తెలిపారు. గతంలో కంటే బ్రిటన్ పార్లమెంట్లో మైనారిటీల ప్రాతినిధ్యం పెరుగుతుందని అంచనా వేశారు. 2019లో జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన 15 మంది ఎంపీలు విజయం సాధించారు. వీరిలో చాలా మంది ఈ ఎన్నికల్లోనూ బరిలో నిలిచారు.
భారత సంతతి ఎంపీలు - బరిలోకి దిగిన నియోజకవర్గాలు ఇవే!
- అలోక్ శర్మ(ఎంపీ) - ప్రస్తుతం ఈయన ఎంపీగా ఉన్నారు. ఈసారి రీడింగ్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు.
- వీరేంద్ర శర్మ - లేబర్ పార్టీ సీనియర్ నేత. ఈలింగ్ సౌతాల్ నుంచి బరిలో దిగుతున్నారు.
- సంగీత్ కౌర్ భైల్, జగిందర్ సింగ్ అనే ఇద్దరు సిక్కులు స్వతంత్ర అభ్యర్థులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- ప్రఫుల్ నర్గుండ్, జస్ అథ్వాల్, బాగీ శంకర్, సత్వీర్ కౌర్, హర్ ప్రీత్, రాజేశ్ అగర్వాల్, గోవా మూలాలున్న కీత్ వాజ్, వారిందర్ జస్, బిహార్‌లో జన్మించిన కనిష్క నారాయణ్, చంద్ర కన్నెగంటి, అమిత్ జోగియా, శైలేశ్ వారా, గగన్ మొహింద్రా వంటి భారత సంతతికి చెందిన వారిలో, కొందరు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తుండగా, మరికొందరు ఇండిపెండెంట్లుగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
- కభారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ రిచ్ మండ్, నార్తల్లెర్టన్ స్థానాల్లో పోటీ చేస్తున్నారు.
- పార్లమెంట్‌కు విభిన్న జాతులు, నేపథ్యాలు నుంచి వచ్చినవారు, ఎంపీలుగా ఎన్నికైతే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని బ్రిటిష్ ఫ్యూచర్ అసోసియేట్ ఫెలో జిల్ రటర్ అభిప్రాయపడ్డారు.
ఎదురీదుతున్న కన్జర్వేటివ్ పార్టీ
బ్రిటన్‌లో గురువారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని వాదనలు వినిపిస్తున్నాయి. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనకు లేబర్ పార్టీ కళ్లెం వేయనుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. సర్వేలు సైతం లేబర్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నాయి. విజయం ఎవరిదో తేలాలంటే ఫలితాల విడుదల వరకు వేచిచూడాల్సిందే.
'మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుంది'- ట్రంప్‌నకు కోర్టులో భారీ ఊరట