ETV Bharat / international

పెళ్లి కాలేదు- కానీ టెలిగ్రామ్ CEOకి 100మంది పిల్లలు- అది కూడా 12 దేశాల్లో! - Telegram CEO Kids - TELEGRAM CEO KIDS

Telegram CEO 100 Kids : 'నాకు పెళ్లి కాలేదు. కానీ 100 మందికిపైగా పిల్లలకు బయోలాజికల్‌ తండ్రినయ్యాను. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో ఆ పిల్లలు ఉన్నారు' అని టెలిగ్రామ్ సీఈవో పావెల్‌ దురోవ్‌ ప్రకటించారు. పెళ్లి కాకుండా ఆయనకు 100 మంది పిల్లలు ఎలా?

Telegram CEO 100 Kids
Telegram CEO 100 Kids (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 10:08 AM IST

Telegram CEO 100 Kids : పావెల్‌ దురోవ్‌‌పై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. మనలో చాలామంది నిత్యం వినియోగించే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' వ్యవస్థాపకుల్లో ఒకరు. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈవోగా పావెల్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన టెలిగ్రామ్‌లో ఒక సంచలన పోస్ట్ పెట్టారు. 12 దేశాల్లోని 100 మందికిపైగా పిల్లలకు తాను బయోలాజికల్‌గా తండ్రినని పేర్కొంటూ టెలిగ్రామ్‌లో పావెల్ ఒక సుదీర్ఘ మెసేజ్ రాసుకొచ్చారు. ఇప్పుడు దానిపై నెటిజన్ల మధ్య ఆసక్తికర చర్చ నడుస్తోంది.

సాయం చేయమన్నస్నేహితుడు!
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. ఆయన వద్ద దాదాపు రూ.129 కోట్ల సంపద ఉంది. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ 100 మందికిపైగా సంతానాన్ని పొందారు. ఇంతకీ ఎలా అనేది ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇతరులకు వీర్యదానం చేయడం ద్వారా అంతమంది పిల్లలకు తాను తండ్రిని అయ్యానని పావెల్ తెలిపారు. '15 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు నన్ను కలిసి వింత సాయం కోరాడు. వారికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడం వల్ల నన్ను వీర్యదానం చేయమని కోరాడు. ఆ సంఘటనతో సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు మరింత అర్థమైంది' అని పావెల్ పేర్కొన్నారు.

వీర్యాన్ని దానం చేసి సంతానం లేని దంపతులకు సాయం చేయడం సామాజిక బాధ్యత అని ఓ డాక్టర్ చెప్పిన మాటల నుంచి తనకు స్ఫూర్తి లభించిందని పావెల్ దురోవ్ అన్నారు. ఆ తర్వాతే తాను స్పెర్మ్‌ డొనేషన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నట్లు టెలిగ్రామ్ సీఈవో చెప్పారు. ఇప్పటిదాకా 12 దేశాల్లో వందమందికిపైగా జంటలకు తాను సంతానాన్ని అందించినట్లు తెలిపారు. 'వాస్తవానికి కొన్నేళ్ల కిందటే నేను వీర్యదానాన్ని ఆపేశాను. అయితే ఫ్రీజ్‌ చేసిన నా వీర్య కణాలతో ఒక ఐవీఎఫ్ క్లినిక్ వాళ్లు ఎన్నో కుటుంబాలకు సంతానం కలిగిస్తున్నారు' అని పావెల్ దురోవ్ వివరించారు.

తక్కువ నంబరే!
సంతానలేమి సమస్య తీవ్రమైన ప్రస్తుత తరుణంలో వీర్య దానానికి మరింత మంది ముందుకు రావాలని టెలిగ్రామ్ ‌పోస్ట్ ద్వారా పావెల్ దురోవ్ పిలుపునిచ్చారు. తన డీఎన్‌ఏ‌ను ఓపెన్ సోర్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా తన వీర్యం ద్వారా పుట్టే పిల్లలు ఒకరినొకరు ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అయితే ఈ విధానంలో కొంత రిస్క్ ఉంటుందనే విషయాన్ని పావెల్ అంగీకరించారు. తనను తాను వీర్యదాతగా చెప్పుకోవడానికి గర్విస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ టెలిగ్రామ్ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 20 లక్షల మందికిపైగా దీన్ని చూశారు. టెలిగ్రామ్‌లో పావెల్‌కు 57 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కాగా, దీనిపై ఎక్స్​లోనూ పెద్ద డిబేట్ జరుగుతోంది. ఈ అంశంపై వైరల్ అవుతున్న ఒక పోస్టుకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ 'చాలా తక్కువ నంబరే నాయనా - చెంగిజ్ ఖాన్​' అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు.

ప్రపంచంలో అత్యంత కాలం జీవించిన కుక్క- 'బ్లూయ్' లైఫ్​ స్పేన్ తెలిస్తే షాకే! - World Longest Lived Dog

భూమి వేగం తగ్గుతోందా? భవిష్యత్తులో రోజుకు 25 గంటలా? - Earth Rotation Speed Change

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.