ETV Bharat / international

'మోదీ అద్భుతమైన వ్యక్తి- ఆయనతో త్వరలో భేటీ అవుతా'- అనూహ్యంగా రివీల్​ చేసిన ట్రంప్‌! - Modi America Tour 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 8:48 AM IST

Trump Modi America Tour : ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆ సమయంలో మోదీతో తాను భేటీ కానున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు.

source ETV Bharat and Associated Press
Modi America Tour Trump (source ETV Bharat and Associated Press)

Trump Modi America Tour : ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ఆ సమయంలో మోదీతో తాను భేటీ కానున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. వచ్చే వారంలో ఆయనతో భేటీ ఉంటుందని ఓ సభలో పేర్కొన్నారు. మోదీ అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మిచిగాన్‌లోని ఫ్లింట్ నగరంలో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌, ప్రధాని మోదీతో భేటీ అవుతానని ప్రకటించటంపై ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.

"మోదీ వచ్చే వారం వస్తున్నారు. నేను ఆయన్ను కలవబోతున్నాను. ఆయన ఓ అద్భుతం. అదే ఆయన ఓ అద్భుతమైన వ్యక్తి." అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు ట్రంప్​. అయితే ఎక్కడ కలుస్తారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్​. దిగుమతులపై భారత్ భారీ​సుంకాలను విధిస్తోందని పేర్కొన్నారు. "వారు(సుంకాలు విధించే దేశాలు) ఎంతో తెలివైన వారు. మాకు వ్యతిరేకంగా వారు వ్యవహరిస్తున్నారు. భారత్ ఎంతో కఠినమైనది. బ్రెజిల్​ కూడా కఠినమైనది. చైనా అన్నింటికంటే కఠినమైనది. కానీ మేము సుంకాల విషయంలో చైనాను జాగ్రత్తగా ఉంటాము." అని పేర్కొన్నారు.

అమెరికా పర్యటనలో మోదీ షెడ్యూల్ ఇదే
సెప్టెంబరు 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆధ్వర్యంలో విల్మింగ్టన్‌ వేదికగా నిర్వహించనున్న నాలుగో "క్వాడ్‌" సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సెప్టెంబరు 22న న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ప్రముఖ సంస్థల సీఈవోలతోనూ భేటీ కానున్నారు. భారత్‌- అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో "సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌"ను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

మోదీ రాక కోసమే వెయిటింగ్- భేటీకి నేను రెడీ: పుతిన్ - Putin On Modi

సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ- కీలక ఒప్పందాలపై సంతకం - PM Modi Singapore Visit

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.