ETV Bharat / international

ఇజ్రాయెల్​కు బిగ్ షాక్- మిలిటెంట్ దాడిలో 21 మంది సైనికులు మృతి - israel hamas war news

Israel Soldiers Killed In Gaza : గాజాలో ఇజ్రాయెల్ బలగాలపై భీకర దాడి జరిగింది. ఓ మిలిటెంట్ చేసిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, దక్షిణ గాజాలోని ఖాన్​యూనిస్ నగరాన్ని ఇజ్రాయెల్ సేనలు చుట్టుముట్టాయి.

israel-soldiers-killed-in-gaza-
israel-soldiers-killed-in-gaza-
author img

By PTI

Published : Jan 23, 2024, 12:03 PM IST

Updated : Jan 23, 2024, 4:18 PM IST

Israel Soldiers Killed In Gaza : గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ బలగాలకు భారీ షాక్ తగిలింది. సెంట్రల్ గాజాలో జరిగిన దాడిలో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం మొదలైన తర్వాత ఓ దాడిలో అత్యధిక మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి.

ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ ఈ మేరకు వెల్లడించారు. రెండు భవనాలను పేల్చేసేందుకు ఇజ్రాయెల్ సైనికులు ప్రయత్నిస్తుండగా ఈ దాడి జరిగిందని చెప్పారు. 'ఇజ్రాయెల్ సైనికులు భవనాలకు పేలుడు పదార్థాలు అమర్చుతున్నారు. అదే సమయంలో ఓ మిలిటెంట్ సైనికులకు దగ్గర్లోని ఓ యుద్ధ ట్యాంకుపై రాకెట్ ప్రొపెలెంట్ గ్రెనేడ్​తో దాడి చేశాడు. దీంతో అనుకున్న సమయానికి ముందే పేలుడు పదార్థాలు బ్లాస్ట్ అయిపోయాయి. ఆ రెండు భవనాలు సైనికులపై కుప్పకూలాయి' అని డేనియల్ వివరించారు.

"సరిహద్దుకు 600 మీటర్ల దూరంలో సైనికులు పని చేస్తున్నారు. హమాస్​కు చెందిన నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. మాకు అందిన సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఉగ్రవాదులు మా భద్రతా బలగాల ట్యాంకుపై ఆర్​పీజీని ప్రయోగించారు. ఈ పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. ఆ సమయంలో సైనికులు భవనం లోపల, భవనానికి దగ్గరగా ఉన్నారు. భవనాన్ని ధ్వంసం చేసేందుకు మా సైనికులు పెట్టిన మైన్​ల వల్లే పేలుడు సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నాం. కానీ, కారణాన్ని నిర్ధరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నాం."
-రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ, ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి

రక్షణ మంత్రి విచారం
సైనికుల మరణం అత్యంత బాధాకరమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సైనికుల త్యాగాల నేపథ్యంలో యుద్ధంలో తమ భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి మరింత దూకుడుతో ముందుకెళ్తామని అన్నారు. ఇజ్రాయెల్ ప్రజల భవిష్యత్​ను ఈ యుద్ధమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.

సైనిక చర్యను నిలిపివేయాలని ఇజ్రాయెల్​పై ఒత్తిడి నెలకొన్న తరుణంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఘర్షణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్​లో సోమవారం సైతం ఆందోళనలు జరిగాయి. హమాస్ చెరలో ఉన్న బందీల కుటుంబ సభ్యులు, మద్దతుదారులు పార్లమెంట్ కమిటీ సమావేశంలోకి చొరబడ్డారు. బందీల విడుదలకు హమాస్​తో ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఖాన్​యూనిస్​ను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సేనలు
హమాస్‌ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్న ఇజ్రాయెల్‌ సేనలు దక్షిణ గాజాలోని ఖాన్‌యూనిస్‌ నగరాన్ని చుట్టుముట్టాయి. ఈ మేరకు ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. గాజాపట్టీలో రెండో అతిపెద్ద నగరం ఖాన్‌యూనిస్‌లో కొన్నిరోజుల నుంచి భీకర పోరాటం జరుగుతోంది. పదుల సంఖ్య పాలస్తీనా ప్రజలు చనిపోగా వందలసంఖ్యలో గాయపడ్డారు. ఖాన్‌యూనిస్‌ నగరం కింద ఉన్న సొరంగంలో హమాస్‌ కీలక నేతలు ఉండొచ్చని ఇజ్రాయెల్‌ సేనలు అనుమానిస్తున్నాయి. గాజాలో హమాస్‌ అగ్రనేత యెహ్యా సిన్వార్‌ స్వస్థలం ఖాన్‌ యూనిస్‌ నగరం. గాజాపై ఇజ్రాయెల్‌ మొదలైన నాటి నుంచి ఆయన ఎక్కడున్నారనేది ఎవరికీ తెలియదు.

హమాస్ చెరలోనే ఇంకా బందీలు- ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారుల్లో విభేదాలు!

గాజా యుద్ధానికి 100 రోజులు- అట్టుడుకుతున్న పశ్చిమాసియా!- అందోళనలో ప్రపంచ దేశాలు!

Last Updated : Jan 23, 2024, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.