ETV Bharat / international

పాకిస్థానీలను రక్షించిన ఇండియన్ నేవీ- సముద్రపు దొంగలపై 12గంటల ప్రత్యేక ఆపరేషన్ - Indian Navy Rescues Pak Sailors - INDIAN NAVY RESCUES PAK SAILORS

Indian Navy Rescues Pak Sailors : భారత నౌకదళం సముద్రపు దొంగల ఆటకట్టించింది. ఇరాన్‌కు చేపల బోటు హైజాక్‌ కావడం వల్ల దాదాపు 12 గంటల పాటు ఆపరేషన్‌ చేపట్టింది. సుముద్రపు దొంగల చెర నుంచి 23మంది పాకిస్థానీ సిబ్బందిని రక్షించింది.

Indian Navy Rescues Pak Sailors
Indian Navy Rescues Pak Sailors
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 7:38 AM IST

Indian Navy Rescues Pak Sailors : భారత నౌకాదళం మరోసారి సముద్రపు దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన చేపల బోటును భారత నౌకదళం రక్షించింది. అందులోని దాదాపు 23 మంది పాకిస్థానీ సిబ్బందిని సురక్షితంగా కాపాడింది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

రంగంలోకి దిగిన ఐఎన్ఎస్​ సుమేధా
గల్ఫ్‌ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్‌ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల 'ఏఐ​- కంబార్'​ బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్రపు దొంగలు పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు భారత్​ నౌకదళానికి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భారత నేవీ ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. తొలుత ఐఎన్‌ఎస్‌ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ త్రిశూల్‌ నౌక ఆపరేషన్​లో చేరింది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్‌ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థాన్‌ జాతీయులు సురక్షితంగా రక్షించినట్లు భారత్ నేవీ పేర్కొంది.

నావికుల భద్రత ముఖ్యం
హైజాక్​కు గురైన బోటును సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు భారత్ నేవీ తెలిపింది. ఆ బోటు తిరిగి తన కార్యకలాపాలు కొనసాగించడానికి తనిఖీలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నట్లు నేవీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా గల్ఫ్‌ ఏడెన్‌లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో భారత నేవీ సాహసాలు చేస్తూ పలు దేశాలకు చెందిన నౌకలకు అండగా నిలుస్తోంది.

ఇండియన్ నేవీ ఇంటెన్స్​ ఆపరేషన్
ఇటీవలే సముద్ర దొంగలు హైజాక్‌ చేసిన MV రుయెన్‌ వాణిజ్య నౌకను భారత నేవీ సముద్రపు దొంగల చెర నుంచి విడిపించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను భారత నౌకాదళం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

99 డ్రోన్లతో రష్యా భీకర దాడులు- ఉక్రెయిన్‌లో కరెంట్​ కట్​! - Russia Attack On Ukraine

సిరియాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి - 44 మంది మృతి- సైనికులే అధికం - Israel Attack On Syria

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.