ETV Bharat / international

'భారత్​కు పాఠాలు చెప్పొద్దు, కూర్చొని మాట్లాడుకుంటేనే మేలు'- ఇండో-అమెరికన్ చట్టసభ్యులు - Indo Americans On Human Rights - INDO AMERICANS ON HUMAN RIGHTS

Indo Americans On Human Rights: భారత్‌- అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్‌ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. 'దేశీ డిసైడ్స్‌' పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొన్న చట్టసభ్యులు ఈ వ్యాఖ్యలు చేశారు.

Indo Americans On Human Rights
Indo Americans On Human Rights (Source: ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 10:37 AM IST

Indo Americans On Human Rights : మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్‌ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు కూర్చోని చర్చించుకోవడం మేలని వారు సూచించారు. 'దేశీ డిసైడ్స్‌' పేరిట నిర్వహించిన సదస్సులో పాల్గొన్న భారతీయ-అమెరికన్‌ చట్టసభ్యులు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం ఉందని సభలో పాల్గొన్న ఆ దేశ చట్టసభ సభ్యుడు రో ఖన్నాఅన్నారు. భారత్‌ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని ఖన్నా గుర్తు చేశారు. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు తమకు ఉపన్యాసాలు ఇస్తున్నాయని భారత్‌ స్పష్టంగా చెబుతుందని అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవన్నారు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలనే ధోరణిలో చర్చించుకుంటే మేలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛ, బలమైన ప్రతిపక్షం ఉండాలని మరో భారత సంతతి చట్టసభ సభ్యుడు అమీ బేరా తెలిపారు. అమెరికాకు భారత్‌ కీలక భాగస్వామి మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలతో పాటు ఇతర అంశాల్లో అమెరికాకు భారత్‌ అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇండియా-యూఎస్‌ మైత్రి మరింత బలపడాల్సిన అవసరం ఉందని మరో సభ్యుడు థానేదార్‌ తెలిపారు. రష్యాను భారత్‌ విడిచిపెట్టి పూర్తిగా అమెరికాతో బంధాన్ని బలపర్చుకోవాలని హితవు పలికారు. చైనాకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ ఒక్కటే పరిష్కారమని అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది ఎన్నికల్లో పోటీ చెయ్యాలి!
భారతీయ అమెరికన్లు అన్ని స్థాయిల పదవులకు పోటీ చేయాల్సిన సమయం ఆసన్నమైందని మరో చట్టసభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు. 'మనమంతా ఇక్కడ కూర్చొని రాజకీయాలు మాట్లాడుతున్నాం. కాబట్టి కచ్చితంగా అందరూ ఓటు వేయాలి. రాజకీయం ఒక పదవి కాదు, అదొక వృత్తి. మీరు డెమొక్రాటైనా, రిపబ్లికనైనా, ఇండిపెండెంట్ అయినా ముందుగా దేశ పౌర వ్యవహారాల్లో భాగస్వాములు కావాలి. రాజకీయాల్లో ఉంటూ మనం మన స్థానిక మందిరాలకు, మసీదులకు మద్దతుగా నిలవాలి. అందుకే సిటీ కౌన్సిల్, స్టేట్ హౌస్, స్టేట్ సెనేట్ ఏదైనా సరే మీలో అత్యధిక మంది ఆయా పదవులకు పోటీ చేస్తారని ఆశిస్తున్నాను' అని కృష్ణమూర్తి అన్నారు.

హెచ్‌-1బీ వీసాదారులకు గుడ్​న్యూస్- ఉద్యోగం కోల్పోయినా అమెరికాలో ఉండొచ్చు! - H1B Visa New Guidelines

'భారత లోక్​సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం'- రష్యా సంచలన ఆరోపణలు - On Lok Sabha Elections 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.