PM Modi Singapore Tour : భారత్ స్వయంగా అనేక 'సింగ్‌పూర్'లను సృష్టించాలనుకుంటోంని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా మోదీ పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో గురువారం చర్చలు జరిపారు. సింగపూర్‌కు చెందిన వివిధ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి భారత్‌లో పెట్టుబడులు పెట్టే అంశాలపై చర్చించారు. విమానయానం, ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో భారత్‌లో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా సింగపూర్ వ్యాపారవేత్తలను ప్రధాని కోరారు. ఈ నేఫథ్యంలో భారత్‌లో దశల వారిగా రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు సుముఖత వ్యక్తం చేశాయి.
ప్రధాని మోదీ సింగపూర్ కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. గత 10 ఏళ్లలో భారతదేశం ఘణనీయమైన అభివృద్ధి సాధించిందని మోదీ తెలిపారు. "భారత్‌లో రాజకీయ స్థిరత్వం, సులభతర వ్యాపారం. సంస్కరణ-ఆధారిత ఆర్థిక ఎజెండాల్లో మార్పులు తీసుకువచ్చాము. పెట్టుబడి నిధులు, మౌలిక సదుపాయాలు, తయారీ, ఇంధనం, లాజిస్టిక్స్‌తో వంటి వివిధ రంగాల్లో వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు.
#WATCH | PM Narendra Modi addresses Business Leaders' summit in Singapore
— ANI (@ANI) September 5, 2024
The PM says, " we are focusing on skill development in india...this is my third term. those who are familiar with india will know that after 60 years a government has been given the mandate for the third… pic.twitter.com/jxTsyn8L10
విమానయాన రంగంలో పెట్టుబడులకు ద్వారాలు తెరిచినట్లు తెలిపారు. దేశీయంగా విమానయాన రద్దీని తీర్చడానికి భారతదేశంలో సుమారు 100కు పైగా కొత్త విమానాశ్రయాలు అవసరం ఉన్నాయని వెల్లడించారు. 'మరిన్ని ఎయిర్‌లైన్ సంస్థలు భారత్‌కు రావాల్సి ఉంది.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏవియేషన్ మార్కెట్ ఏదైనా ఉందంటే, అది ఇండియానే" అని ప్రధాని పేర్కొన్నారు.
భారత్ లుక్ ఈస్ట్ పాలసీకి సింగపూర్‌ను "ముఖ్యమైన ఫెసిలిటేటర్"గా అభివర్ణించిన మోదీ, "ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పదేళ్లు పూర్తి కానుంది. గత 10 సంవత్సరాలలో రెండు దేశాల మధ్య వాణిజ్యం రెండింతలు పెరిగింది. పరస్పర పెట్టుబడులు దాదాపు మూడు రెట్లు పెరిగి 150 బిలియన్ డాలర్లను దాటింది. మేము యూపీఐ పేమెంట్ సదుపాయాన్ని మొదట సింగపూర్‌లోనే ప్రారంభించాం'' అని ప్రధాని మోదీ అన్నారు.
My visit to Singapore has been a very fruitful one. It will certainly add vigour to bilateral ties and benefit the people of our nations. I thank the government and people of Singapore for their warmth. pic.twitter.com/hx0DVl71WX
— Narendra Modi (@narendramodi) September 5, 2024
భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సింగపూర్ వ్యాపారుల పాత్రను మోదీ కొనియాడారు. ఇండియాలో పెడ్డుబడులు పెట్టేవారి కోసం సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఇది భారత్- సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచడం సహా ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలకును బలోపేతం చేస్తుందన్నారు.
Had a very good meeting with Mr. Tharman Shanmugaratnam, the President of Singapore. Our talks focused on the full range of bilateral ties between our nations. We discussed the key focus sectors like skill development, sustainability, technology, innovation and connectivity.… pic.twitter.com/bdivx16hrv
— Narendra Modi (@narendramodi) September 5, 2024
'బలమైన సంబంధాల కోసం ఎదురుచూస్తున్నా'- బ్రూనై పర్యటనతో మోదీ సరికొత్త రికార్డ్ - PM Modi Brunei Visit
సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ- కీలక ఒప్పందాలపై సంతకం - PM Modi Singapore Visit