ETV Bharat / international

ఉక్రెయిన్​తో శాంతి చర్చలు- భారత్ మధ్యవర్తిత్వం వహిస్తే బెటర్- ఆ దేశాలు కూడా!​ : పుతిన్ - Russia Ukraine War - RUSSIA UKRAINE WAR

Russia Ukraine peace talks : ఉక్రెయిన్​తో శాంతి చర్చలకు చైనా, భారత్, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించవచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం హోరాహోరీగా జరుగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Russia Ukraine peace talks
Russia Ukraine peace talks (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 3:32 PM IST

Updated : Sep 5, 2024, 5:01 PM IST

Russia Ukraine peace talks : ఉక్రెయిన్​తో శాంతి చర్చలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్​తో శాంతి చర్చలకు చైనా, భారత్, బ్రెజిల్ మధ్యవర్తిత్వం వహించవచ్చని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రెండేళ్ల క్రితం ఇస్తాంబుల్​లో కుదిరిన ప్రాథమిక ఒప్పందాన్ని ఉక్రెయిన్ అమలు చేయడంలేదని ఆరోపించారు. ఆ ఒప్పందం ఆధారంగానే భవిష్యత్తులో శాంతి చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వెల్లడించింది.

శాంతి చర్చలకు రష్యా సిద్ధం
వ్లాదివాస్తోక్​లో జరుగుతున్న ఈస్ట్రన్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సు సందర్భంగా పుతిన్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా ఉక్రెయిన్​తో శాంతి చర్చలపై స్పందించారు. తామ ఉక్రెయిన్​తో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. తాము ఎన్నడూ చర్చలను తిరస్కరించలేదని పేర్కొన్నారు. అసంబద్ధ డిమాండ్ల ఆధారంగా వీటిని చేపట్టలేమని పుతిన్‌ చెప్పుకొచ్చారు. ఇటీవల ఉక్రెయిన్​లో పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీతో చర్చలు జరిపిన రెండు వారాల వ్యవధిలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

"మేము మా మిత్రదేశాలు, భాగస్వామ్య దేశాలను గౌరవిస్తాం. చైనా, భారత్, బ్రెజిల్ వంటి మా మిత్రదేశాలు ఉక్రెయిన్- రష్యా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సమస్యపై రష్యా మిత్రదేశాలతో నేను నిరంతరం టచ్​​లో ఉంటాను. ఇస్తాంబుల్​లో జరిగిన చర్చల్లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి ప్రతినిధుల బృందం ఒప్పందంపై సంతకం చేసింది. అంటే ఆ షరతులపై ఉక్రెయిన్‌ సంతృప్తిగా ఉన్నట్లే లెక్క. అమెరికా, ఐరోపాల ఒత్తిడి కారణంగానే ఇది అమల్లోకి రాలేదు. రష్యాను వ్యూహత్మకంగా ఓడించాలని కొన్ని ఐరోపా దేశాలు కలగంటున్నాయి." అని పుతిన్ వ్యాఖ్యానించారు.

అందులో భారత్ చాలా కీలకం
శాంతి ప్రక్రియలో భారత్‌ కీలకమని క్రెమ్లిన్‌లో పుతిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. భారత ప్రధాని మోదీ-పుతిన్‌ మధ్య నిర్మాణాత్మక, స్నేహపూర్వక సంబంధాలున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రధాన భాగస్వాములతో నేరుగా మాట్లాడే అవకాశం ఉందన్నారు. ఇక మోదీకి మాస్కో, కీవ్‌, వాషింగ్టన్​తో సత్సంబంధాలు ఉన్నాయని, దిల్లీ ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని శాంతికి బాటలు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్​తో చర్చలను తమకు ఎటువంటి ముందస్తు షరతులు లేవన్నారు.

శాంతి చర్చలు జరపాలన్న మోదీ
కాగా, ఆగస్టు 23న ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్​లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని విరమించాలని పేర్కొన్నారు. ఇరుదేశాల శాంతి చర్చలు జరపాలని సూచించారు. ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని మోదీ తెలియజేశారు. అలాగే రష్యా పర్యటనలోనూ ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అంతలోనే, రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు భారత్​ను మధ్యవర్తిత్వం వహించగలదని పుతిన్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ఎల్లప్పుడూ శాంతివైపే భారత్​- ఉక్రెయిన్, రష్యా చర్చించుకోవాల్సిందే!: మోదీ - Modi Zelensky Talks

ప్రపంచాన్ని యుద్దాలు భయపెడుతున్నాయా? - భారత్​ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? - Prathidhwani Debate on World war

Last Updated : Sep 5, 2024, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.