Imran Khan Jail Sentenced : సార్వత్రిక ఎన్నికలకు ముందు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్‌కు అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసు (సైఫర్ కేసు)లో పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీకి కూడా 10 ఏళ్ల జైలుశిక్షను విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రావల్పిండిలోని అడియాలా జైలులో జరిగిన కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబుల్ హస్నత్ జుల్కర్నైన్ ఈ తీర్పును ఇచ్చారు.
ఈ తీర్పును ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్(PTI) ధ్రువీకరించింది. ఇది బూటకపు కేసు అని, పైకోర్టులో ఈ తీర్పును సవాలు చేస్తామని పేర్కొంది. మీడియాకు గానీ, ప్రజలకు గానీ విచారణకు సంబంధించిన విషయాలు తెలపలేదని ఆరోపించింది.
తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. అయితే, ఆ వెంటనే సైఫర్ కేసులో ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గతేడాది సెప్టెంబర్‌లో ఇమ్రాన్ ఖాన్, ఖురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జుల్కర్నైన్ జైల్లోనే ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు ఏంటంటే?
ప్రధాని పదవి నుంచి దిగిపోయేముందు నిర్వహించిన ఓ బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ ఇమ్రాన్ ఖాన్ కొన్ని పత్రాలు ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వాటిని సేకరించినట్లుగా అప్పట్లో ఆయన పేర్కొన్నారు. దీనిపై అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదైంది.
Imran Khan Nomination Rejected : పాకిస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వద్దామని ఆశించిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కొన్నాళ్ల క్రితం ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరగనున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం ఇమ్రాన్ ఖాన్ వేసిన నామినేషన్లను పాక్ ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన పోటీ చేసేందుకు అవకాశమే లేకుండా పోయింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Imran Khan Disqualification : ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఐదేళ్లపాటు అనర్హత వేటు
ఇమ్రాన్ అరెస్ట్‌పై పాక్ సుప్రీం ఫైర్.. వెంటనే రిలీజ్ చేయాలని ఆర్డర్