ETV Bharat / international

100 ఏనుగులకన్నా మేఘమే బరువు- నీటికి తడే ఉండదు- ఒక్కసారిగా షాక్ అయ్యారా? - Interesting Facts

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 23, 2024, 4:56 PM IST

మేఘాలు తేలికగా ఉంటాయి! నీరు తడిగా ఉంటుంది! ఈ రెండూ మనం చాలా సార్లు అనే ఉంటాం. కానీ అవి నిజాలు కాదు. ఎందుకు? ఎలా? అనేది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి మరి.

INTERESTING FACTs
Clouds And Water (Getty Images)

Cloud Weight Elephant : తలెత్తి ఆకాశంలో చూస్తే కదిలే మేఘాలు కాసేపు కట్టిపడేస్తాయి. దూది పింజల్లా, కాంతివంతంగా హాయిగా కదలాడే మేఘాలు చాలా తేలిగ్గా ఉంటాయి అనుకుంటాం కదా. అని కానీ అది నిజం కాదు. మేఘాలు అంత తెలికైనవేం కాదు. వాటికీ బరువుంటుంది. అది కూడా కూడా తక్కువేం కాదు మనం మోయలేనంత! కిలోల్లో కాకుండా టన్నుల్లో అన్నమాట! అయినా సరే మేఘాలు కిందపడకుండా గాలిలో తేలియాడుతున్నట్టే ఉంటాయి. అసలు మేఘాల కధ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేఘం అంటే చిన్నదేం కాదు విస్తరించి ఉండేదని మనకు తెలుసు. అందుకే మబ్బులు వస్తే మీ ఇంటి మీదో , పక్కింటి మీదో మాత్రమే వర్షం పడదు. ఒక ప్రాంతం అంతా తడిచిపోతుంది. ఒక జిల్లా అంతా వర్షం పడొచ్చు. ఒక రాష్ట్రం అంతా వానలు రావచ్చు. అంటే మేఘం చాలా పెద్దదే కదా! ఆ పెద్ద మేఘం బరువు లక్షల టన్నులు ఉంటుందన్నమాట. మరి అంత బరువైన మేఘం ఆకాశంలో ఎలా తేలుతుందన్న అనుమానం రావాలే మీకు?

ఇప్పుడు చదివాక వచ్చింది కదా! ఆకాశంలో మేఘంతో పాటు గాలి కూడా ఉంటుందని మనకు తెలుసు. తన చుట్టూ ఉండే గాలి సాంద్రత మేఘం సాంద్రత కంటే 0.4 శాతం తక్కువగా ఉంటుంది. అందుకే గాలిలో మేఘాలు తేలుతాయి. అంటే ఒక మేఘం అత్యంత బరువైన అంటార్కిటిక్ బ్లూ వేల్ కంటే, వంద ఏనుగులకంటే కూడా బరువుగా ఉంటుందన్నమాట!

నీటికి తడి లేదు!
ఇది మరీ వింతగా ఉంది కదా. ఇలా ముట్టుకుంటే అలా తడిచిపోతాం కదా, నీరు తడి లేదని ఎలా చెబుతారని ఆశ్చర్యపోకండి. కాస్త లాజికల్​గా ఆలోచించండి. నీరు తడిగా ఉండదు కానీ ఇది వస్తువులను తడి చేస్తుంది. ఇంకా సింపుల్​గా చెప్పాలంటే నీటిని తాకిన తర్వాత మన శరీరం తడిగా మారుతుంది. అప్పటి వరకు నీరు ద్రవంగా ఉంటుంది. మనం పొడిగా ఉంటాం. అంటే కొన్ని ఘన పదార్ధాలను నీరు తడి చేస్తుంది.

Is Water Wet Yes Or No : అసలు శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే నీటిలో ఉండే పరమాణువుల నిర్మాణం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. నీటిని తేమ నుంచి ఘన పదార్ధానికి మధ్య ఉండే ఒక స్థితిగా చెప్పవచ్చు. అలాగే ఈ తడిదనమనేది నీటిని గ్రహించే అటువైపు పదార్థం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నీటిని కొన్ని పదార్థాల మీద వేస్తే తడిసిపోతాయి. కానీ అదే వాటర్ ప్రూఫ్ వస్తువుల మీద వేసినా, అంత ఎందుకు కొవ్వొత్తిని కూడా మీరు తడిగా మార్చలేరు.

నత్తనడక వెనుక అసలు 'సీక్రెట్'- ఎందుకు నత్తలు స్లోగా నడుస్తాయో తెలుసా? - why snail moves slowly

చీమలకు ఊపిరితిత్తులు ఉండవ్‌! మరెలా గాలి పీల్చుకుంటాయో తెలుసా? - How Do Ants Breathe

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.