ETV Bharat / international

'కమలా హారిస్‌ కాదు, ట్రంప్‌ గెలిస్తేనే భారత్‌కు మంచిది!' - US Presidential Elections - US PRESIDENTIAL ELECTIONS

US Presidential Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత హిందూ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా 'హిందూస్‌ ఫర్ అమెరికా ఫస్ట్‌' అనే సంస్థ డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Trump
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 9:31 AM IST

US Presidential Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారత హిందూ సమాజం నుంచి మద్ధతు లభిస్తోంది. వాస్తవానికి కమలా హారిస్‌కు భారత మూలాలు ఉన్నాయి. కానీ ఆమెను కాదని డొనాల్డ్ ట్రంప్‌నకే 'హిందూస్ ఫర్ అమెరికా ఫస్ట్‌' అనే సంస్థ మద్దతు ప్రకటించడం గమనార్హం.

ట్రంపే బెస్ట్‌!
'అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌నకు మా మద్దతు ఉంటుంది. ట్రంప్ అధ్యక్షుడైతే భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు బాగుంటాయి. అదే కమలా హారిస్‌ అయితే ఈ సంబంధాలు అస్థిరంగా మారతాయి' అని హిందూస్‌ ఫర్ అమెరికా ఫస్ట్ సంస్థ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన ఉత్సవ్ సందూజా వ్యాఖ్యానించారు.

ఆసియా అమెరికన్‌ ఓటర్లపై కూడా!
"అమెరికాకు కమలా హారిస్‌ అధ్యక్షురాలు అయితే భారతదేశానికి సంబంధించిన అంశాలపై ఆందోళనకరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. అంతేకాదు యూఎస్‌లో ఉదారవాదుల ఆధిపత్యం ఎక్కువుతుంది. సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా తిప్పి కొట్టే అవకాశం లేకపోలేదు. ఆసియాఅమెరికన్‌ ఓటర్లపై కూడా ప్రభావం పడుతుంది. అంతేకాదు ప్రస్తుతమున్న బైడెన్-హారిస్‌ అధికార యంత్రాంగంలోనూ అక్రమ వలసలు భారీగా పెరిగాయి. సరిహద్దు భద్రత ఆందోళనకరంగా ఉంది. నేరాలు, డ్రగ్‌ స్మగ్లింగ్‌ పెరిగిపోయాయి. మైనారిటీ కమ్యూనిటీలపై ప్రభావం పడుతోంది. అందులో ఆసియా-అమెరికాలకు సంబంధించిన వ్యాపారులు కూడా ఉన్నారు" అని ఉత్సవ్ సందూజా అన్నారు.

మోదీతో ట్రంప్‌నకు మంచి అనుబంధమే!
"ట్రంప్‌ అధ్యక్షుడు అయితే భారత్‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. కనుక రక్షణ, సాంకేతిక అంశాలకు సంబంధించి భారత్‌కు మేలు జరుగుతుందని మేము భావిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్‌నకు మంచి అనుబంధమే ఉంది. చైనా కంటే మనకు ఎక్కువ ప్రాజెక్టులు ఇచ్చే అవకాశమూ ఉంటుంది. హిందూ జనాభా ఎక్కువగా ఉండే జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, మిచిగాన్, ఆరిజోనా, నెవాడ ప్రాంతాల్లో ట్రంప్‌నకు అనుకూలంగా మేము ప్రచారం చేస్తాం. ట్రంప్‌ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని మేము నమ్ముతున్నాం" అని ఉత్సవ్ సందూజా పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.