హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లాపై దాడి ఘటనలోనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ కూడా హతం అయినట్లు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. మరోవైపు, హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఎక్కడ ఉన్నాడో కొన్ని నెలల ముందే ఇజ్రాయెల్‌కు తెలుసని ఆ దేశ రక్షణ వర్గాలు ఓ వార్తాసంస్థకు వెల్లడించాయి. ఆయన వేరే ప్రాంతానికి పారిపోయి తప్పించుకోకముందే, దాడి చేయాలని గత వారమే నిర్ణయించినట్లు తెలిపాయి. నస్రల్లా ఉన్న ప్రదేశంలో నిమిషాల వ్యవధిలో 80కి పైగా బాంబులు జారవిడిచినట్లు సమాచారం.
నస్రల్లాపై దాడిలోనే ఇరాన్ జనరల్ మృతి! రెండు నెలలుగా రెక్కీ! ఎస్కేప్ కాకముందే అటాక్‌కు పక్కా ప్లాన్! - Hezbollah chief dead - HEZBOLLAH CHIEF DEAD
Published : Sep 28, 2024, 2:05 PM IST
|Updated : Sep 28, 2024, 7:31 PM IST
Hezbollah leader Hassan Nasrallah is killed : హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతిచెందినట్లు ఇజ్రాయెల్ శనివారం అధికారికంగా ప్రకటించింది. హెజ్‌బొల్లా కూడా ఈ విషయాన్ని అంగీకరించింది. ఉగ్రసంస్థ లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది.
LIVE FEED
నస్రల్లాతో పాటు ఇరాన్ జనరల్ మృతి
అవును, నస్రల్లా మృతి చెందారు : ధ్రువీకరించిన హెజ్‌బొల్లా
- ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో సంస్థ చీఫ్ హసన్ నస్రల్లా మృతి చెందారని ధ్రువీకరించిన హెజ్‌బొల్లా
- పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతోపాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని ప్రకటన
హెజ్‌బొల్లాకు అండగా నిలవండి- ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు
- హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఓ ప్రకటనను విడుదల చేసిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ
- లెబనాన్ పౌరులను చంపడాన్ని ఖండిస్తున్నానని, ఈ దాడులు ఇజ్రాయెల్ నేతల మూర్ఖపు విధానాలను రుజువు చేస్తున్నాయని విమర్శలు
- లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కంచుకోటను ధ్వంసం చేసేంత స్థాయి ఇజ్రాయెల్‌కు లేదని వ్యాఖ్యలు
- పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన శక్తులు హెజ్‌బొల్లాకు అండగా నిలవాలని పిలుపు
హెజ్‌బొల్లా నెక్స్ట్ చీఫ్ ఇతడేనా?
- హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటన
- దీంతో తదుపరి చీఫ్ ఎవరనేదానిపై అంతర్జాతీయ మీడియాలో చర్చ
- హెజ్‌బొల్లా వర్గాలు, ఇరాన్ నేతలకు ఆమోదయోగ్యంగా ఉండాలని వాదన
- ఈ క్రమంలోనే సంస్థ రాజకీయ వ్యవహారాలు పర్యవేక్షించే హషీమ్ సఫీద్దీన్‌ను నస్రల్లా వారసుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కథనాలు
- నస్రల్లాకు సఫీద్దీన్ సమీప బంధువు కూడా, 2017లో అతడిని ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా
ఇరాన్ హై అలర్డ్- సేఫ్ ప్లేస్‌కు సుప్రీం లీడర్!
ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య జరుగుతోన్న భీకర పోరుతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దళాలు చేస్తోన్న భీకరదాడులతో హెజ్‌బొల్లాకు భారీ నష్టం సంభవిస్తోంది. తాజాగా ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుపెట్టినట్టు సమాచారం. ఇజ్రాయెల్ సైన్యం దూకుడు వేళ, ఇరాన్ అప్రమత్తమవుతోంది. తమ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది.
నస్రల్లా కుమార్తెతో పాటు ఆరుగురు మృతి
ఇజ్రాయెల్ శుక్రవారం చేసిన దాడుల్లో ఆరుగురు మృతిచెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే నస్రల్లా మరణ వార్తలపై హెజ్‌బొల్లా ఇంకా స్పందించలేదు. అయితే, శుక్రవారం రాత్రి నుంచి అతడు కాంటాక్ట్‌లో లేడని హెజ్‌బొల్లా వర్గాలు వెల్లడించాయి. అటు నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. దక్షిణ బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై జరిపిన వైమానిక దాడుల్లో జైనబ్ నస్రల్లా మరణించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఆమె మృతిని కూడా హెజ్‌బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు.
ఐరాసలో ఇజ్రాయెల్ ప్రధాని మ్యాపుల ప్రదర్శన
హమాస్‌తో పోరు మొదలైన తర్వాత తొలిసారి ఐరాస వేదికగా ప్రసంగించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రెండు చేతుల్లో రెండు మ్యాపులను ప్రదర్శించారు. ఒకదానికి 'శాపం'(The Curse), మరొక దానికి 'వరం'(The Blessing) అని పేర్లుపెట్టి వాటిలో పలుదేశాలను పేర్కొన్నారు. ఆసియా దేశాలకు చెందిన ఆ మ్యాపుల్లో భారత్ పేరును ప్రస్తావించారు. ఈ సందర్భంగా వెస్ట్‌బ్యాంక్, గాజా నగరాలతోపాటుగా సిరియాలోని గోలన్‌హైట్స్‌ను ఇజ్రాయెల్‌లో భాగంగా చూపించడం గమనార్హం. అందులో బారత్‌ను 'వరం' వైపు గ్రీన్ కలర్లో చూపించారు.