Gaza Protest Los Angeles Today : ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు ఆస్కార్ వేడుక వేదిక వద్ద నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ వద్ద నిరసనలతో పలువురు ప్రముఖులు అస్కార్ వేడుకల కార్యక్రమానికి ఆలస్యంగా హాజరయ్యారు.

నిరసనలపై ముందే సమాచారం ఉన్న లాస్ ఏంజిల్స్ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకల చుట్టుపక్క ప్రాంతాలను తనిఖీలు చేశారు. అయితే అంతలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు మద్దతుగా నిలవాలని అక్కడికి వచ్చే ప్రముఖులను కోరారు. మరోవైపు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు అందుకున్న బిల్లీ ఇలిష్, ఫినియాస్ గాజాకు మద్దతిస్తూ ప్రత్యేక బ్యాడ్జీని ధరించడం గమనార్హం. మరికొందరు ప్రముఖులూ వీరి బాటలోనే గాజాకు మద్దతుగా నిలిచారు.


కాల్పుల విరమణకు అమెరికా కృషి
గాజాలో 6 వారాల కాల్పుల విరమణ కోసం అమెరికా కృషి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అలాగే హమాస్‌పై పోరు విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అనుసరిస్తున్న తీరుపై జో బైడెన్ శనివారం మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంజమిన్ వైఖరి ఆయన సొంత దేశాన్నే గాయపరుస్తోందని వ్యాఖ్యానించారు. గాజాలో పౌరుల మరణాల విషయంలో ఇజ్రాయెల్ నిబంధనలకు కట్టుబడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా పెద్ద పొరపాటని పేర్కొన్నారు. దాదాపు 1.3 మిలియన్ల పాలస్తీనీయులు ఆశ్రయం పొందుతున్న రఫా ప్రాంతాన్నీ ఇజ్రాయెల్ ఆక్రమించే అవకాశం ఉందన్న వార్తలపై బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు అనుసరిస్తున్న కఠిన వైఖరికి దాన్ని హద్దుగా భావిస్తున్నామని తెలిపారు.
అయితే ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని బైడెన్ చెప్పడం గమనార్హం. ఆ దేశ రక్షణ, అక్కడి పౌరుల భద్రత చాలా కీలకమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొన్ని రకాల ఆయుధాలను అందించటం, ఐరన్ డోమ్ వ్యవస్థకు మద్దతివ్వటం వంటి విషయాల్లో రాజీ ఉండదని స్పష్టం చేశారు. తన అభిప్రాయాన్ని నేరుగా ఇజ్రాయెల్ వెళ్లి అక్కడి పార్లమెంటుకే తెలియజేయాలనుకుంటున్నానని బైడెన్ వెల్లడించారు.
'ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడిని అడ్డుకోవడంలో మోదీదే ముఖ్యపాత్ర!'
'భద్రతా మండలిలో వెంటనే సంస్కరణలు చేపట్టాల్సిందే!'- UNOకు భారత్ వార్నింగ్