ETV Bharat / international

ట్రంప్​నకు పోటీగా కమలా హారిస్ - డెమొక్రటిక్ అభ్యర్థిగా ఫిక్స్ - US Elections 2024 - US ELECTIONS 2024

Democratic Party Nominee Kamala Harris : డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారైంది. డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌‌లో భాగంగా నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియలో 99 శాతం ఓట్లతో ఆమె తిరుగులేని మద్దతును సంపాదించారు.

Democratic Party Nominee Kamala Harris
Democratic Party Nominee Kamala Harris (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 10:26 AM IST

Updated : Aug 6, 2024, 10:58 AM IST

Democratic Party Nominee Kamala Harris : అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో భారత సంతతి మహిళ కమలా హారిస్ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ఆమె పేరు అధికారికంగా ఖరారైంది. డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌‌లో భాగంగా అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం గత ఐదురోజులుగా ఆన్‌లైన్‌లో ఓట్లను సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం డెమొక్రటిక్ పార్టీ క్యాడర్ వేసిన ఓట్లలో దాదాపు 99 శాతం ఓట్లు కమలా హారిస్‌కే అనుకూలంగా వచ్చాయి. దీంతో ఆ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది కమలే అని తేలిపోయింది. డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందిన తొలి నల్లజాతి వనితగా ఆమె ఘనతను సాధించారు. ప్రస్తుతం అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హారిస్ వ్యవహరిస్తున్నారు.

పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో కీలక ప్రకటన
వాస్తవానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని భావించారు. అయితే జూన్‌లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన లైవ్ డిబేట్‌లో బైడెన్ తడబడ్డారు. ట్రంప్‌నకు ధీటుగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. దీంతో బైడెన్‌‌కు ప్రజా మద్దతు గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. కమలా హారిస్‌కు తన మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈక్రమంలోనే డెమొక్రటిక్ పార్టీ క్యాడర్ నుంచి కమలకు స్పష్టమైన మద్దతు లభించింది. ఆ పార్టీలోని కీలకమైన 1,976 మంది ప్రతినిధులు ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో కమల అధ్యక్ష అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయింది. ఈనెల 19 నుంచి 22 వరకు షికాగో వేదికగా డెమొక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ జరగనుంది. ఆ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్​ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు.

ట్రంప్‌నకు పోటీ ఇచ్చే సత్తా కమలకే ఉంది
'అసోసియేటెడ్ ప్రెస్ - ఎన్‌ఓఆర్‌సీ సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్' సంయుక్త సర్వేలో కీలక విషయాలు వెలుగుచూశాయి. బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వెంటనే నిర్వహించిన ఈ సర్వేలో 46 శాతం మంది అమెరికన్లు కమలకు తమ మద్దతును ప్రకటించారు. బైడెన్ కంటే కమలా హారిసే డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఉండటం ఉత్తమమని వారు అభిప్రాయపడ్డారు. పార్టీలోని మెజారిటీ క్యాడర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారని సర్వే నివేదికలో ప్రస్తావించారు. ట్రంప్‌నకు బలమైన పోటీని ఇచ్చే సత్తా కమలకు ఉందని సర్వేలో పాల్గొన్న ప్రజలు పేర్కొన్నారు.

అధ్యక్ష ఎన్నికల రేసులో వెనుకబడిన ట్రంప్​ - దూకుడు మీదున్న కమలా హారిస్​! - US Election 2024

ట్రంప్​తో డిబేట్​కు నో చెప్పిన కమలా హారిస్​! - KAMALA HARRIS AND TRUMP DEBATE

Last Updated : Aug 6, 2024, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.