ETV Bharat / international

బ్రెజిల్​లో​ కార్చిచ్చుల బీభత్సం- వేలాది ఎకరాల అమెజాన్​ అటవీప్రాంతం అగ్నికి ఆహుతి

Brazil Wildfires 2024 : బ్రెజిల్‌లోని రొరైమా రాష్ట్రంలో 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరవు తాండవిస్తుండటం వల్ల పెద్ద ఎత్తున దావాగ్ని చెలరేగింది. కార్చిచ్చుల దెబ్బకు అమెజాన్‌ అడవిలోని కొంత భాగంతో పాటు వేలాది ఎకరాల్లో పంటలు కాలి బూడిదవుతున్నాయి. గత నెల(ఫిబ్రవరి)లో బ్రెజిల్ అంతటా పెద్ద సంఖ్యలో కార్చిచ్చులు చెలరేగగా కేవలం రొరైమా రాష్ట్రంలోనే 2 వేలకు పైగా కార్చిచ్చులు నమోదయ్యాయి. కార్చిచ్చులకు సహజ పరిస్థితులే కాకుండా మానవ తప్పిదాలు కూడా కారణమని తెలుస్తోంది.

Brazil Wildfires 2024
Brazil Wildfires 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 6:46 AM IST

Brazil Wildfires 2024 : దాదాపు 60 శాతం అమెజాన్‌ అడవులు కలిగిన దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌లో కరవు కారణంగా చెలరేగిన దావాగ్ని బీభత్సం సృష్టిస్తోంది. కార్చిచ్చుల వల్ల వేలాది ఎకరాల్లో అమెజాన్ అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతి అవుతోంది. తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటం వల్ల అక్కడి వృక్ష, జంతుజాలంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దావానలం తీవ్రత రొరైమా రాష్ట్రంలో అధికంగా ఉంది. బ్రెజిల్‌ భూభాగంలో రొరైమా కేవలం 2.6 శాతమే అయినప్పటికీ అక్కడ ఫిబ్రవరి నెలలో ఏకంగా 2,057 కార్చిచ్చులు సంభవించాయి. బ్రెజిల్‌వ్యాప్తంగా నమోదైన కారిచ్చుల్లో కేవలం రొరైమాలోనే 30 శాతం నమోదయ్యాయి.

రొరైమాలో అటవీ మంటలు జనావాసాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చే సమయం ఉండదని ఓ రైతు తెలిపారు. ఇంటిని, పొలాలను వదిలేసి ప్రాణాల కోసం పరుగులు తీయడం తప్ప ఏమీ చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. రొరైమా రాష్ట్రంలో తరచూ కార్చిచ్చులు సంభవిస్తుండటం వల్ల అధికారులు మంటలార్పేందుకు 600 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మరో 240 మంది అగ్నిమాపక సిబ్బందిని అందులో చేర్చుకున్నారు. అయితే సరిపడా హెలికాప్టర్లు లేకపోవడం వల్ల మంటల్ని అదుపుచేయడం కష్టతరంగా మారిందని గవర్నర్ ఆంటోనియో తెలిపారు. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వానికి సాయం కోరినట్టు చెప్పారు.

బ్రెజిల్‌వ్యాప్తంగా కార్చిచ్చులు సంభవిస్తున్నప్పటికీ రొరైమా రాష్ట్రంలో ఆ సంఖ్య ఎక్కువగా ఉండటం వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. కొందరు వ్యక్తులు తమ భూములను విస్తరించేందుకు అటవీ ప్రాంతాల్లో అక్రమంగా చెట్లను కాల్చుతుండటం వల్ల మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అమెజాన్ అడవులు అంతరించిపోయే ప్రమాదం!
Amazon Forest Extinction : అమెజాన్ అడవులు అంతరించేపోయే ప్రమాదం పొంచి ఉందా? 2050 నాటికి టిప్పింగ్‌ పాయింట్‌కు అమెజాన్‌ అడవులు చేరుకోనున్నాయా? రానున్న 25 ఏళ్లలో 10 నుంచి 47 శాతం అమెజాన్‌ అడువులు పచ్చికబయళ్లుగా మారనున్నాయా? అవుననే అంటోంది తాజా అధ్యయనం. ఉష్ణోగ్రతలు పెరగడం, విపరీతమైన కరవులు, అటవీ నిర్మూలన, కార్చిచ్చులు కారణంగా అమెజాన్‌ ప్రాంతం తీవ్ర ఒత్తిడికి గురవుతోందని బ్రెజిల్‌లోని ఓ యూనివర్శిటీ అధ్యయనం ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Greece Wildfires 2023 : గ్రీస్​లో కార్చిచ్చు బీభత్సం.. 18 మంది బలి.. బూడిదైన ఇళ్లు..

ఎటు చూసినా కాలిన శవాలే.. బూడిద దిబ్బగా 'హవాయి' స్వర్గధామం.. కార్చిచ్చు మిగిల్చిన పెను విషాదమిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.