Goddess Kali Crown Stolen : 2021 మార్చిలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జెషోరేశ్వరీ ఆలయంలోని కాళీమాతకు ఇచ్చిన కిరీటాన్ని ఎవరో దొంగిలించారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, నేరస్థులను పట్టుకొని, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
" we have seen reports of theft of the crown gifted by pm modi to jeshoreshwari kali temple (satkhira) in 2021 during his visit to 🇧🇩 we express deep concern & urge govt of bangladesh to investigate theft, recover the crown & take action against the perpetrators," posts @ihcdhaka. pic.twitter.com/8jpDL1noCn
— Press Trust of India (@PTI_News) October 11, 2024
"ప్రధాని నరేంద్ర మోదీ కాళీ మాతకు ఇచ్చిన కిరీటం దొంగతనానికి గురికావడం చాలా ఆందోళన కలిగిస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే దర్యాప్తు ప్రారంభించి, కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలి. దీనికి బాధ్యులైన నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలి."
- బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం
ఇంతకీ ఏం జరిగింది?
బంగ్లాదేశ్‌లోని సత్కిరా, శ్యామ్నగర్లో జెషోరేశ్వరీ దేవీ ఆలయం ఉంది. ఆ ఆలయంలోని కాళీ మాతకు 2021లో భారత ప్రధాని ఒక కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అయితే గురువారం ఆలయ పూజారి దిలీప్ ముఖర్జీ పూజలు ముగించి, బయటకు వెళ్లిన తరువాత మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల మధ్యలో దొంగతనం జరిగింది. ది డైరీ స్టార్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఆలయంలో పనిచేసే సిబ్బంది (ఆలయాన్ని శుభ్రపరిచే వ్యక్తులు) దుర్గా మాత తలపై ఉన్న కిరీటాన్ని తీసినట్లు పోలీసులు గుర్తించారు. దొంగలను గుర్తించేందుకు ఆలయంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
కిరీటం విశిష్టత ఇదే!
దొంగతనానికి గురైన ఆ కిరీటం పూర్తిగా బంగారం, వెండిలతో తయారు చేసినది. దీనికి సాంస్కృతికంగానూ, మతపరంగానూ ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ పురాణాల ప్రకారం, భారత ఉపఖండంలో 51 శక్తి పీఠాలు ఉన్నాయి. వాటిలో జెషోరేశ్వరీ ఆలయం ఒకటి. శివుడు ఆగ్రహంతో సతీదేవీని ఖండించగా, ఆమె అరచేతులు, అరికాళ్లు ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు. దీనితో అప్పటి నుంచి సతీదేవిని జేషోరేశ్వరి పేరుతో ఇక్కడ పూజిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో పరమశివుడు చండ రూపంలో దర్శనమిస్తారు.
కరోనా మహమ్మారి విజృంభణ తరువాత భారతప్రధాని నరేంద్ర మోదీ 2021 మార్చి 27న బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఈశ్వరీపుర్లోని జెషోరేశ్వరీ ఆలయాన్ని సందర్శించి, కాళీ మాతకు కిరీటాన్ని కానుకగా సమర్పించారు.
At the Jeshoreshwari Kali Temple. pic.twitter.com/XsXgBukg9m
— Narendra Modi (@narendramodi) March 27, 2021
12వ శతాబ్దం చివరిలో అనారి అనే బ్రాహ్మణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం, సదరు బ్రాహ్మణుడు జషోరేశ్వరి పీఠం కోసం 100 తలుపులు గల ఆలయాన్ని నిర్మించారు. ఆ తరువాత 13వ శతాబ్దంలో లక్ష్మణ్ సేనుడు అనే రాజు దానిని పునరుద్ధరించారు. 16వ శతాబ్దంలో రాజా ప్రతాప్ ఆదిత్య ఈ ఆలయాన్ని పునర్మించారు.