ETV Bharat / health

వెయిట్ లాస్​కు రోటీలు బెస్ట్ ఆప్షనే! మరి ఏ పిండితో చేసిన రొట్టెలు తినాలి? - Types Of Rotis For Weight Loss

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 7:32 AM IST

Which Roti Is Best For Weight Loss :హెవీ ఫుడ్, జంక్​ ఫుడ్ తింటే బరువు పెరుగుతారని, లైట్​గా టేస్టీగా ఉండే చపాతీలకే మొగ్గు చూపుతున్నారు చాలా మంది. బరువు తగ్గాలనుకునే వారికి రోటీలు మంచివే!. కానీ ఏ పిండితో తయారు చేసిన రొట్టెలు తింటే త్వరగా వెయిట్​లాస్ అవుతారు?

Which Roti Is Best For Weight Loss
Which Roti Is Best For Weight Loss (Getty Images)

Which Roti Is Best For Weight Loss : రోటీ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ, ఇది భారతీయ వంటగదిలో ఎప్పటి నుంచో చేస్తున్న ఆహార పదార్థమే. కాకపోతే ప్రదేశాన్ని బట్టి వేరు వేరు పద్ధతుల్లో, వేరు వేరు పదార్థాలతో తయారు చేసుకుని తింటుంటారు. ఉదాహరణకు రాజస్టాన్ ప్రజలు రోటీలను ఎక్కువగా సజ్జలతో తయారు చేసుకుంటారు. పంజాబ్ వాసులు మైదా లాంటి పిండితో చేసుకుంటారు.

అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో రొట్టెలను గోధుమ పిండి, జొన్న పిండితో చేసుకుని తింటుంటారు. ప్రస్తుతం ఆరోగ్యంపై చాలా మంది శ్రద్ధ పెరిగిపోవడం వల్ల మిల్లెట్లతో కూడా రోటీలను తయారు చేసుకుంటున్నారు. కారణం ఇందులో కేలరీలు తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటమే. శరీర బరువు పెరుగుతుందని ఈ మధ్య చాలా మంది కేవలం రోటీలతోనే రోజు గడిపేస్తున్నారు.

మూడు పూటల్లో ఓ పూట పాలు. పండ్లు తీసుకుని, ఇంకో పూట పస్తులుండి లేదా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకుని, మిగిలిన ఒక్క పూట రోటీలను తింటున్నారు. మొత్తానికి వెయిట్ లాస్ అవాలంటే తమ డైట్ ప్లాన్ లో రోటీ లేదా చపాతీ తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి రోటీలు మంచి ఆహారమే కానీ, ఏ పిండితో చేసిన రోటీలు చక్కగా సహాయపడతాయి. ప్రముఖ పోషకాహార నిపుణులు రుచితా బాత్రా తన ఇన్​స్టాగ్రామ్​లో తాజాగా ఓ వీడియెను షేర్ చేశారు. ఆమె అభిప్రాయం ప్రకారం తక్కువ కేలరీలు కలిగినవి, మైక్రో న్యుట్రియంట్లు కలిగిన రోటీలు కొన్ని ఉన్నాయట. అవేంటంటే?

గోధుమ పిండి రొట్టెలు:
భారతీయులు ఎక్కువగా తినే గోధుమ పిండి రొట్టెల్లో దాదాపు 70 నుంచి 80 కేలరీలు ఉంటాయట. ఇందులో బీ విటమిన్లు, మినరల్స్​ పుష్కలంగా ఉంటాయట.

రాగి రొట్టెలు:
రాగి రోటీల్లో కాల్షియం, డైటరీ ఫబైర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవ మొత్తంలో ఉంటాయి. వీటిని తమ రోటీన్ డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గి ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి చక్కటి ఆహారంగా చెప్పచ్చు. రాగి పిండితో చేసిన ఒక రొట్టెలో దాదాపు 80 నుంచి 90 కేలరీలు ఉంటాయి.

జొన్న రొట్టెలు:
గ్లూటెన్ రహితమైనది, అధిక ఫైబర్ కలిగినది, తక్కువ గ్లైసిమిక్ స్థాయిలు కలిగి ఉన్న ఆహార పదార్థాల్లో జొన్న రొట్టలు ప్రధానమైనవి. గ్లూటెన్ సెన్సిటివిటీతో ఇబ్బంది పడుతున్న వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, కేలరీలను అదుపులో ఉంచడానికి జొన్న రొట్టలు బాగా సహాయపడతాయి. ఒక జొన్న రొట్టెలో 50 నుంచి 60 కేలరీలు ఉంటాయి.

మల్టీగ్రేన్ రోటీలు:
రకరకాల పదార్థాలతో తయారు చేసిన మల్టీగ్రేన్ రోటీలు తినడం వల్ల శరీరానికి చాలా రకాల విటమిన్లు, మినరల్లు అందుతాయి. అలాగే ఫైబర్ అధికంగా లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రోటీలు మంచి ఆహారంగా పనిచేస్తాయి. ఒక మల్టీగ్రేన్ రోటీలో 80 నుంచి 100కేలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఏ రోటీలు చక్కగా సహాయ పడతాయో అర్థమయే ఉంటుంది కాదా. కానివ్వండి మరీ మీ డైట ప్లాన్​లో జొన్న రొట్టెలను చేర్చుకోవడం మర్చిపోకండి.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.