ETV Bharat / health

అలర్ట్ : చీర అలా కట్టుకుంటే క్యాన్సర్ ఖాయం! - దేవుడా ఇంకా ఎన్ని చూడాలో! - What is Saree Cancer - WHAT IS SAREE CANCER

Saree Cancer: క్యాన్సర్‌ అంటే.. మాగ్జిమమ్ తెలిసి చేసే చెడు అలవాట్లు ద్వారా వస్తుంది. లేదంటే తెలియక చేసే తప్పుల ద్వారా వస్తుంది. కానీ.. చీర కట్టుతో కూడా క్యాన్సర్ వస్తుందని మీకు తెలుసా? అవును.. మీరు చదువుతున్నది నిజమే. చీర కట్టుకుంటే మహిళల్లో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

Saree Cancer
Saree Cancer (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 11:14 AM IST

What is Saree Cancer: భారతీయ మహిళలు అత్యధికంగా ధరించే వస్త్రాల్లో.. చీరది మొదటి స్థానం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలనే తేడా లేకుండా మెజారిటీ మహిళలు ప్రతిరోజూ చీరలే కట్టుకుంటారు. అయితే.. ఇప్పుడు వారు వస్త్రధారణను సవరించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు నిపుణులు! చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. మరి.. ఇది నిజమేనా? చీరకు క్యాన్సర్ కు సంబంధం ఏంటి..? ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

చీర క్యాన్సర్ అనేది చాలా అరుదైన స్కిన్ క్యాన్సర్. ఇది చీర ధరించే స్త్రీలలో నడుము చుట్టూ వస్తుందట. ఎందుకంటే.. చీర కట్టుకునే ముందు లోపల లంగా ధరిస్తారు. ఈ లంగాను బొందుతో గట్టిగా చుట్టి నడుము చుట్టూ బిగిస్తారు. రోజూ ఇలాగే చేస్తుంటారు. దీంతో కొన్నేళ్ల తర్వాత ఆ భాగంలో చర్మం నల్లగా మారి ఊడిపోవడం మొదలవుతుంది. దురద కూడా మొదలవుతుంది. ఈ లక్షణాలను పట్టించుకోకపోతే క్యాన్సర్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దిల్లీకి చెందిన ఆంకాలజిస్ట్ డాక్టర్ వివేక్ గుప్తా చెబుతున్నారు.

కేవలం చీర కట్టుకునే వారికే కాకుండా బిగుతుగా ఉండే బట్టలు ధరించే వారిలోనూ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. చీర కట్టు క్యాన్సర్ వ్యాప్తికి వస్త్రం కంటే అపరిశుభ్రత పద్ధతులే ఎక్కువగా కారణమంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు ఉన్న ప్రాంతాల్లోనూ ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. వైద్య పరిభాషలో దీన్ని స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) అని అంటారట.

అలర్ట్ : నోట్లో ఈ సమస్యలుంటే - షుగర్​ ముప్పు ఉన్నట్టే! - Diabetes Warning Signs

స్క్వామస్ సెల్ కార్సినోమా: చర్మం, నోరు, గొంతు, ఊపిరితిత్తులు, జననేంద్రియాలు సహా ఇతర శరీర భాగాలలోని స్క్వామస్ కణాలలో ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్ ఇది. అత్యంత సాధారణ చర్మ క్యాన్సర్‌లలో ఇది ఒకటి. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం, నడుము చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి కారణాల వల్ల ఇది ఎక్కువగా వస్తుందని డాక్టర్​ వివేక్​ గుప్తా అంటున్నారు.

2023లో ముంబయిలోని ఆర్.ఎన్. కూపర్ హాస్పిటల్​లో జరిగిన ఒక అధ్యయనంలో, నడుము చుట్టూ గట్టిగా లంగా ధరించే మహిళల్లో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC) అనే చర్మ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో 200 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో 100 మంది SCC తో బాధపడుతున్నారని.. మిగిలిన 100 మంది ఆరోగ్యంగా ఉన్నారని కనుగొన్నారు. చీరలు ధరించే మహిళలు SCC కు గురయ్యే అవకాశం ఎక్కువ అని కనుగొన్నారు. కాబట్టి బిగుతుగా ధరించకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాత్రి కావాల్సినంత నిద్రపోయినా - పగటిపూట మళ్లీ నిద్రపోతున్నారా? - అయితే ఇదే సమస్య కావొచ్చు! - What is Idiopathic Hypersomnia

హెచ్చరిక: ముక్కులో వేలు పెట్టి తిప్పుతున్నారా? - ఏకంగా మెదడుకే ముప్పు పొంచి ఉందట! - Side Effects of Nose Picking

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.