ETV Bharat / health

ఉప్పు ఎక్కువగా వాడుతున్నారా? - మిమ్మల్ని ఈ వ్యాధులు ఎటాక్​ చేస్తాయంటున్న నిపుణులు! - Side Effects of Salt in Body

Side Effects of Salt: ఉప్పు వల్ల ఎన్ని అనర్థాలు వస్తాయో వైద్యులు నిత్యం హెచ్చరిస్తూనే ఉంటారు. హద్దు దాటితే ప్రాణాలకే ప్రమాదమని చెబుతుంటారు! ఉప్పు వంట రుచిని ఎంతగా పెంచుతుందో.. ఆరోగ్యాన్ని అంతగా దెబ్బ తీస్తుందని అంటున్నారు వైద్యులు. ఉప్పు లిమిట్​ దాటిందా.. ఈ ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

salt side effects on body
salt side effects on body (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Aug 20, 2024, 11:41 AM IST

Updated : Sep 14, 2024, 10:50 AM IST

Side Effects of Salt on Body: వంటల్లో ఉప్పు ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత గొప్ప వంటకమైనా.. అందులో సరిపడా ఉప్పు లేకపోతే దానిలోని రుచి బయటకు రాదు. కూరగాయలు, పండ్లు, మాంసాలు, తృణధాన్యాలు.. వీటన్నింటిలో ఎంతోకొంత ఉప్పు ఉంటుంది. కండరాలు సంకోచించడం, సడలించడంలో ఉప్పు ఉపయోగపడుతుంది. నరాలు ఉత్తేజితమవడానికి ఇది దోహదం చేస్తుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్న ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా వాడడం వల్ల పలు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రముఖ జనరల్ ఫిజీషియన్​ డాక్టర్ వుక్కల రాజేశ్​ చెప్పారు. ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అధిక రక్తపోటు: శరీరంలో ఉప్పు శాతం పెరిగితే.. అది రక్తపోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి హైపర్‌టెన్షన్​కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు.. గుండె జబ్బులకు(National Institute of Health రిపోర్ట్​) కూడా కారణమవుతుందని చెప్పారు. తలనొప్పి, తల తిరగడం, వేగవంతమైన హృదయ స్పందన లాంటివి కనిపిస్తాయన్నారు.

శరీరంలో వాపు: ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు పేరుకుపోతుందని వైద్యులు వివరించారు. ఫలితంగా చేతులు, పాదాలు, ముఖం, కాళ్లలో వాపు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

తరచూ మూత్రం : ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే కాకుండా మూత్రం ముదురు రంగులోకి మారి దాని పరిమాణం కూడా తగ్గుతుందన్నారు. ఫలితంగా మూత్రపిండాలపై ఒత్తిడి పెరిగి.. ఎక్కువగా పని చేయాల్సి ఉంటుందని వివరించారు.

అలసట, బలహీనత: ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో బలహీనత, అలసట వస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు చేసే పనిపైనా ఏకాగ్రత పెట్టలేమని తెలిపారు. ఫలితంగా శరీర సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.

పదే పదే దాహంగా అనిపించడం: ఉప్పును అధికంగా తినడం వల్ల తరచుగా దాహం వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదనపు ఉప్పును తొలగించడానికి శరీరం ప్రయత్నించే మార్గం ఇది అని వివరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతాన్ని తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటు తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలని.. అందులోని సహజ ఉప్పు శరీరానికి మంచిదని తెలిపారు. ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని అదనపు ఉప్పు తొలగిపోతుందని వివరించారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఉప్పు, చక్కెరలో మైక్రో ప్లాస్టిక్స్? తింటే చాలా డేంజర్​! ఇలా చెక్​ చేసుకోండి! - Microplastics Found

రోజూ ఉదయాన్నే నడవడం వల్ల కీళ్లు అరిగిపోతాయా? - ఇందులో నిజం ఎంత? - Walking CAUSE Knee Pain

Last Updated : Sep 14, 2024, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.