ETV Bharat / health

నిద్ర లేవగానే ఇలా చేస్తున్నారా? మీకు ఈ వ్యాధులు వచ్చే ఛాన్స్ జాగ్రత్త! - WHAT WE DO MISTAKES IN MORNING TIME

-లేవగానే కఠిన వ్యాయామాలతో కండరాల సమస్యలు -బ్రేక్​ఫాస్ట్ తినకపోవడం వల్ల ఊబకాయం, స్థూలకాయం ముప్పు

What We do Mistakes in Morning Time
What We do Mistakes in Morning Time (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 1, 2024, 2:33 PM IST

What We do Mistakes in Morning Time: మనలో చాలామంది మార్నింగ్ లేవగానే టీ, కాఫీ తాగేసి.. టైమ్ లేదని బ్రేక్‌ఫాస్ట్ తినకుండానే ఆఫీసుకి వెళ్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం లేవగానే చేసే చిన్న చిన్న పొరపాట్లేంటో తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకుంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండచ్చంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుడిపక్కకు తిరిగి లేవాలట
ఉదయం నిద్ర లేచేటప్పుడు కొంతమంది వెల్లకిలా పడుకొని అదే పొజిషన్‌లో గబుక్కున లేచి కూర్చుకుంటారు. అయితే, ఇలా లేవడం వల్ల బిగుసుకుపోయిన కండరాల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి ఉదయం లేచేటప్పుడు మొదటగా కుడిపక్కకు తిరిగి నెమ్మదిగా లేవడం మంచిదని సూచిస్తున్నారు. ఆపై కాస్త అటూ ఇటూ కదలడం వల్ల రాత్రంతా నిశ్చలంగా ఉన్న శరీర భాగాలకు రక్తప్రసరణ మెరుగవుతుందని చెబుతున్నారు. ఇదే రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుందని అంటున్నారు.

కంగారు పడొద్దు
ఉదయం త్వరగానే నిద్ర లేచినా ఆఫీసు టైం వరకు ఏదో ఒక పని చేస్తూ ఆఖరి క్షణాల్లో కంగారు పడుతుంటారు. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆ రోజుకు కావాల్సిన కాయగూరలు తరుక్కోవడం, ఆఫీసుకి వేసుకునే దుస్తులు తీసి పెట్టుకోవడం.. వంటి పనుల్ని ముందురోజు రాత్రే ముగించుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా మరుసటి రోజు ఉదయం ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్ర లేవడానికి, పనులు ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుందని వివరించారు.

బ్రేక్‌ఫాస్ట్‌ మానద్దు!
ముఖ్యంగా చాలా మంది ఆఫీస్‌కు సమయం అవుతోందని బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తుంటారు. ఫలితంగా స్థూలకాయం, మధుమేహం.. వంటి సమస్యలు తెచ్చి పెట్టే ప్రమాదం ఉందని Diabetes, Metabolic Syndrome and Obesity జర్నల్​లో తేలింది. Skipping Breakfast and Risk of Chronic Disease: A Systematic Review and Meta-Analysis అనే అధ్యయనంలో పోలండ్​లోని The Medical University of Warsaw H. Szajewska (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) పాల్గొన్నారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉదయం లేచిన దగ్గర్నుంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌కూ సమయం సరిపోతుందని సలహా ఇస్తున్నారు.

లేవగానే మొబైల్​ చూస్తున్నారా?
మనలో చాలా మంది ఉదయం లేవగానే మొబైల్‌ చెక్ చేసుకోవడం, కాల్స్ మాట్లాడడం, చాటింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే నెగెటివ్‌ వార్తలేమైనా కంట పడితే ఉదయాన్నే మూడ్ మొత్తం అప్‌సెట్ అవుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా అత్యవసర కాల్స్, మెసేజెస్ చేసే పనుంటే తప్ప ఉదయం లేవగానే మొబైల్స్ జోలికి వెళ్లకపోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. దీనికి బదులుగా ఉదయం లేవగానే కాసేపు పుస్తకం చదవాలని చెబుతున్నారు.

వార్మప్‌తో షురూ!
ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల రోజంతటికీ కావాల్సిన శక్తి, ఉత్సాహాం అందుతుంది. దీంతో కొంతమంది ఉదయం లేవగానే అధిక బరువులెత్తడం, ఇతర కఠినమైన వ్యాయామాలు చేస్తుంటారు. ఇలా చేయడం కండరాల ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాత్రి నిద్రపోయే సమయంలో శరీరంలో పెద్దగా కదలికలు లేకపోవడంతో ఉదయం లేచే సమయానికి కండరాలు, ఎముకలు బిగుసుగా మారిపోతాయి. కాబట్టి వీటిని వెంటవెంటనే కదిలించడం, కఠినమైన వ్యాయామాలు చేయడం, ఒకేసారి ఎక్కువ బరువులెత్తడం కాకుండా.. నెమ్మదిగా కదిలించే ప్రయత్నం చేయాలని అంటున్నారు. ఇందుకోసం వ్యాయామానికి ముందు కాసేపు వార్మప్, యోగా, ధ్యానం చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఫలితంగా కండరాలు రిలాక్సయ్యే అవకాశం ఉంటుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్ పేషెంట్స్ రోజు ఎంత నీరు తాగితే మంచిది? తలనొప్పికి వాటర్​తో చెక్!

హెయిర్ లాస్​తో ఇబ్బంది పడుతున్నారా? దీంతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా వస్తుందట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.