ETV Bharat / health

అన్నం తింటూనే బరువు తగ్గాలా? ఈ టిప్స్ మీకోసమే! - రైసు తింటూ బరువు తగ్గడానికి టిప్స్

Weight Loss Tips With Rice Eating : ఈ రోజుల్లో యువతతో పాటు పెద్దవారిలో ఎదురవుతున్న ప్రధాన సమస్య అధిక బరువు. చాలా మందికి బరువు తగ్గాలని కోరిక ఉన్నా డైట్ ఫాలో కాలేక ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీకు నచ్చిన పదార్థాలు తింటూనే బరువు తగ్గవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయ్యండి.

Weight Loss Tips With Rice Eating
Weight Loss Tips With Rice Eating
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 7:48 PM IST

Updated : Jan 26, 2024, 8:03 PM IST

Weight Loss Tips With Rice Eating : ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వల్ల చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలంటే రైస్ తప్పనిసరిగా మానేయడం సహా ఇతరత్రా కఠినమైన ఆహార నియమాలు పాటించాలని చెబుతుంటారు కొందరు. ఆ డైట్​లు పాటించటం సాధ్యం కాక చాలా మంది బరువు తగ్గడంపై వెనకడుగు వేస్తుంటారు. అయితే రైస్​తో పాటు మనకు నచ్చిన ఆహారం తింటూ బరువు తగ్గవచ్చు. అవునండీ రైస్​ను సరిగ్గా తీసుకుంటే అది మన బరువు తగ్గడంలో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు పోషకాహార నిపుణులు. అదేలాగో తెలుసుకుందాం మరి.

అన్నంతో పాటు కూర సమానంగా
బరువు తగ్గాలంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నంతో సమానంగా కూరలు లేదా పప్పులు తినాలి. దీని వల్ల రైస్ తినటం తగ్గుతుంది. అదే విధంగా కూరలు, పప్పులలో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అవి బరువు తగ్గడంలో ఉపయోగపడుతాయి. అంతే కాకుండా అన్నం తక్కువ తీసుకోవటం వల్ల శరీరంలో అధిక కేలరీలు కూడా పెరగవు.

చిన్నప్లేట్లను వాడండి
మనం ఆహారం తీసుకునేటప్పుడు వాడే ప్లేట్లతోనూ మన అలవాట్లలో మార్పులు వస్తాయి. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు చిన్నప్లేట్లను వాడాలి. దానిలో రైస్, కర్రీ, పప్పులు ఉండేలా చూసుకుండి. ఇలా చేయడం వల్ల మన మనసుకు తక్కువ తింటున్న అనుభూతి కలగదు. శరీరానికి కావాల్సినంత ఆహారం మాత్రమే తీసుకుంటాం.

సలాడ్​లను తీసుకోండి
మీ రోజువారి ఆహారంలో తప్పకుండా సలాడ్​లు ఉండేలా చూసుకోండి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటం సహా ఫైబర్, విటమిన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. అవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. వాటితో పాటు కూరగాయలలో ఉండే పీచు పదార్థాల వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దాని వల్ల రైస్ తక్కువగా తీసుకుంటారు.

ప్రోటీన్ పుడ్ తీసుకొండి
ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల మీకు త్వరగా ఆకలి వెయ్యదు. గ్రిల్డ్ చికెన్, చేపలు, బీన్స్ వంటి తించే త్వరగా ఆకలి వెయ్యదు. ఇలా తినటం వల్ల మీ బరువు తగ్గడం సహా కండరాల శక్తి పెరగుతుంది.

మజ్జిగ తీసుకొండి
మీ బరువును తగ్గించుకోవడంలో మజ్జిగ ఉపయోగపడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు, అధిక సంఖ్యలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం ద్వారా శరీరం డీహైడ్రెట్ కాకుండా ఉత్సాహంగా ఉంటారు. అన్నంలో మజ్జిగ వేసుకుని తింటే ఆకలి తగ్గుతుంది.

ఇవండి మీరు రైస్ మానేయకుండానే మీ బరువును తగ్గించుకునే చిట్కాలు. వీటిని పాటిస్తూ మీకు నచ్చిన ఆహారం తీసుకుంటూనే ఎంచక్కా మీ బరువును తగ్గించుకోండి.

అలర్ట్‌ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?

టాబ్లెట్స్‌ మింగడం మీవల్ల కావట్లేదా? - ఈ టిప్స్‌ పాటిస్తే ప్రాబ్లమ్ క్లియర్!

Last Updated : Jan 26, 2024, 8:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.