ETV Bharat / health

టాన్సిల్స్ సమస్యతో ఏం తినలేకపోతున్నారా? ఇది తాగితే మీ గొంతు నొప్పి పక్కా మాయం! - TONSILS TREATMENT IN AYURVEDA

-టాన్సిల్స్ సమస్యకు ఆయుర్వేద పద్ధతిలో ఔషధం తయారీ -ఈ ఔషధాన్ని పుకులించుకుంటే గొంతు నొప్పి పరార్!

Tonsils Treatment in Ayurveda
Tonsils Treatment in Ayurveda (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : 2 hours ago

Tonsils Treatment in Ayurveda: గొంతులో వచ్చే టాన్సిల్స్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా బాధపెడుతుంటుంది. గొంతులో నొప్పితో ఏం తినలేక, తాగలేక అవస్థలు పడుతుంటారు. ఈ సమస్య తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఆయుర్వేద పద్ధతిలో ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం ఉందని ప్రముఖ వైద్యులు గాయత్రీ దేవీ చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకందాం.

కావాల్సిన పదార్థాలు

  • 50 గ్రాముల తిప్పతీగ చూర్ణం
  • 50 గ్రాముల యష్టిమధు చూర్ణం
  • 50 గ్రాముల గుగ్గులు
  • ఒక చెంచా తేనె
  • ఆర చెంచా పటిక భస్మం

తయారీ విధానం

  • ముందుగా స్టౌ వెలిగించుకుని ఓ గిన్నెలో నీటిని పోసుకుని వేడిచేసుకోవాలి.
  • మరోవైపు ఓ గిన్నెను తీసుకుని అందులో తిప్పతీగ, యష్టిమధు, గుగ్గులు చూర్ణం వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి కాసేపు మరిగించుకోవాలి.
  • అనంతరం దీనిని వడపోసుకుని వేడి చల్లారే వరకు పక్కకు పెట్టుకోవాలి.
  • కాస్త గోరువెచ్చగా అయ్యాక చెంచా తేనెను కలిపేసుకుంటే ఔషధం రెడీ!
  • ఈ ఔషధాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 30-40 మిల్లీ లీటర్ల పరిమామంలో ఇవ్వాలని సూచిస్తున్నారు.

పుకులించుకునే ఔషధం తయారీ విధానం

  • ఇప్పుడు మరో ఔషధం తయారీ కోసం స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఈ నీటిని పక్కకు పెట్టుకుని దీనిలో పటిక భస్మం వేసుకుని కలిపితే ఔషధం రెడీ!
  • ఈ ఔషధాన్ని ఉదయం, సాయంత్రం ఒకసారి నోటిలో పుకిలించుకుని ఉమ్మివేయాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల వెంటనే ఉపశమనం కలుగుతుందని వివరిస్తున్నారు.

తిప్పతీగ: ఇది చక్కటి యాంటీ బయాటిక్​గా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ చెబుతున్నారు.

యష్టిమధు: ఇది గొంతుకు చాలా చక్కటి మేలును చేస్తుందని గాయత్రీ దేవీ అంటున్నారు. గొంతులో ఉండే వాపు, కఫం సమస్యను తగ్గించడంలోనూ బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

గుగ్గిలు: గుగ్గిలు మంచి యాంటీ బయాటిక్, యాంటీ ఇన్​ఫ్లామేటరీగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా టాన్సిల్స్​లో వచ్చిన వాపు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని వివరిస్తున్నారు.

పటిక: యాంటీ సెఫ్టిక్​గా బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? డైలీ ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ఈజీగా వెయిట్ లాస్!

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.