ETV Bharat / health

అలర్ట్ : కళ్ల కింద క్యారీ బ్యాగ్స్ వేధిస్తున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే వెంటనే క్లియర్​ అయిపోతాయ్! - Tips to Remove Under Eye Swelling - TIPS TO REMOVE UNDER EYE SWELLING

Under Eye Swelling: కొంతమందికి ఉదయం లేవగానే కళ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. మరికొంతమందికి అప్పుడప్పుడూ ఇలా అవుతుంటుంది. ఈ వాపును తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. పెద్దగా ఫలించవు. అయితే.. ఈ వాపును తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్​ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Under Eye Swelling
Under Eye Swelling (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 12:36 PM IST

Tips to Remove Under Eye Swelling: మనలో చాలా మందికి ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్ల చుట్టూ వాపు కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్ల కింద ఎక్కువగా వాపు ఉంటుంది. సాధారణంగా ఇది కొద్దిసేపటి తరువాత తగ్గిపోతుంది. కానీ, ఒక్కోసారి ఒకటి రెండు రోజులు అలానే ఉంటుంది. ఈ పరిస్థితికి.. అలెర్జీలు, కళ్లు పొడిబారడం, తగినంత నిద్రపోకపోవడం, అధిక ఒత్తిడి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, సరిపడా నీళ్లు తాగకపోవడం, స్మోకింగ్​, డ్రింకింగ్​ వంటివి కారణాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వాపును దూరం చేయడానికి కొన్ని చిట్కాలు సహాయపడతాయని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

బంగాళదుంప: కళ్ల కింద వాపును తగ్గించే లక్షణాలు బంగాళాదుంపలో ఎక్కువని నిపుణులు అంటున్నారు. అందులో ఉండే కాటేచోలేస్ అనే పదార్థం... వాపును సాధారణ స్థితికి తీసుకువస్తుందని చెబుతున్నారు. అందుకోసం మీడియం సైజులో ఉండే బంగాళాదుంపను గుండ్రంగా, పల్చగా కట్ చేసి ఫ్రిజ్​లో అరగంట పాటూ ఉంచాలి. తరువాత వాటిని కళ్ల కింద పెట్టాలి. ఇలా పావుగంట సేపు వదిలేసి... తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకుంటే మీకే తేడా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ పద్ధతిని పలు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.

ఉప్పు నీళ్లు: కంటి కింద వాపును తగ్గించడంలో ఉప్పు నీళ్లు బాగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. నీళ్లు వేడిచేసి అందులో అర స్పూను ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత రెండు కాటన్​ బాల్స్​ అందులో ముంచి నీళ్లు పీల్చుకున్నాక... వాటిని కళ్ల వాపుపై ఉంచాలి. అరగంటకోసారి ఆ కాటన్​ బాల్స్​ను వేడి ఉప్పు నీళ్లలో ముంచి కళ్ల ముందు పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ప్రాబ్లమ్​ సాల్వ్​ అవుతుందని అంటున్నారు.

గుడ్డు: కోడిగుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజూ గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇదే గుడ్డు కళ్ల కింద వాపును తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం గుడ్డు పగుల గొట్టి చిన్న గిన్నెలో వేసుకోవాలి. అందులోని పచ్చసొనను తీసేసి.. తెల్లసొనను మాత్రమే తీసి కళ్ల వాపుకి రాయాలి. పది నిమిషాల తరువాత చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి.

అలర్ట్ : వర్షాకాలం మీ కళ్లకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్​ సోకే ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?

కీరదోస: దీనిని కూడా చాలా మంది కళ్ల మీద పెట్టుకుని రిలాక్స్​ అవుతుంటారు. అయితే ఈ కీరదోస కళ్ల కింద వాపును కూడా తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. కీరదోసకాయను రౌండ్ ఆకారంలో ముక్కలుగా చేసుకోండి. వాటిని కొద్ది సేపు ఫ్రిజ్​లో ఉంచి.. ఆ తర్వాత 25 నిమిషాల పాటు వాపు ఉన్న ప్రదేశంలో ఉంచితే ఉపశమనం లభిస్తుందని అంటున్నారు.

టీ బ్యాగ్స్: ఇవి కేవలం టీ తాగడానికి మాత్రమే కాకుండా.. కళ్ల వాపును తగ్గించుకోవడానికి కూడా సహాయపడతాయి. అందుకోసం టీ బ్యాగులను కొద్ది సేపు ఫ్రిజ్​లో ఉంచండి. తర్వాత వాటిని తీసి కళ్లపై ఉంచుకోండి. ఒక 25-30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత వాటిని తీసివేసి మీ కళ్లను శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గుతుందని చెబుతున్నారు.

ఐస్​ క్యూబ్స్​: కళ్ల కింద వాపును తగ్గించడానికి ఐస్​ క్యూబ్​లు బెస్ట్​ అని నిపుణులు అంటున్నారు. అందుకోసం ఓ క్లాత్​ తీసుకుని అందులో 2 ఐస్​ క్యూబ్స్​ వేసుకుని ఓ 5 నిమిషాల పాటు వాపు ఉన్న ప్రదేశంలో ఉంచి తీసేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల వాపు తగ్గుతుంది. చల్లని కంప్రెస్​ కూడా కళ్ల కింద వాపును తగ్గిస్తుందని చెబుతున్నారు.

2016లో డెర్మటాలజీ రిసెర్చ్ అండ్ ప్రాక్టీస్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చల్లని కంప్రెస్ లేదా ఐస్​ క్యూబ్స్​ ఉపయోగించడం వల్ల కళ్ల వాపు ఉన్న వారిలో వాపు, చికాకు గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో సియోల్ నేషనల్ యూనివర్శిటీ హాస్పిటల్ లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డెర్మటాలజీలో ప్రొఫెసర్ డాక్టర్ జి. యున్ పాల్గొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కంటికి కూడా స్ట్రోక్​ ముప్పు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ కళ్లు సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.