Tips For Vegetables And Fruits Fresh : మెజారిటీ జనం మార్కెట్‌కు వెళ్లినప్పుపడు.. వారానికి సరిపడా పండ్లు, కూరగాయలను ఒకేసారి ఇంటికి తెచ్చుకుంటారు. అయితే.. సమ్మర్‌లో అవి త్వరగా తాజాదనం కోల్పోయే ఛాన్స్ ఉంది. ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్‌లో స్టోర్ చేసినా కూడా కొన్ని పాడవుతుంటాయి. అయితే.. వీటిని స్టోర్ చేసే ముందు కొన్ని టిప్స్ పాటించడం వల్ల.. ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ టిప్స్ పాటించండి!
- మార్కెట్ నుంచి తీసుకువచ్చిన పండ్లు, కూరగాయలను.. ఉప్పు, వెనిగర్ కలిపిన నీటిలో బాగా కడకండి. ఆ తర్వాత వాటిని తడి లేకుండా తుడిచి ఫ్రిజ్‌లో పెట్టండి. దీంతో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
- కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇథలీన్ గ్యాస్ విడుదల చేస్తాయి. కాబట్టి వాటిని ఇతర పండ్లు, కూరగాయలకు దూరంగా పెట్టాలని సూచిస్తున్నారు. ఇథలీన్ గ్యాస్‌ను విడుదల చేసే పండ్లలో యాపిల్స్, ఆప్రికాట్స్, తర్బూజా వంటివి ఉంటాయి.
- కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. జిప్పర్ బ్యాగ్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయాలని చెబుతున్నారు.
- ఒకవేళ మీ ఇంట్లో అలాంటి బ్యాగులు లేకపోతే.. మామూలు కవర్లకే చిన్న చిన్న రంధ్రాలు చేసి వాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కాయగూరలకు గాలి తగిలి అవి కుళ్లిపోకుండా ఉంటాయి.
- ద్రాక్ష పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిని బాగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. తర్వాత ప్లేట్‌లో టిష్యూ పేపర్లను పరిచి అందులో ద్రాక్ష పండ్లను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయి.
- వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెట్ట కూడదు. తేమ తగలని ప్రదేశంలో బయట నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
- ఉల్లిపాయలు, బంగాళాదుంపలను కూడా బయటే పెట్టాలి. ఒక బుట్టల్లో పెట్టి తడిలేని చోట నిల్వ చేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
- కొంత మంది కూరగాయలను కట్ చేసి స్టోర్ చేస్తుంటారు. ఇలాంటి వారు వాటిని బేకింగ్ సోడా ద్రావణంలో కడిగి నిల్వ చేయాలి. దీంతో ఎక్కువ రోజులు అవి ఫ్రెష్‌గా ఉంటాయి.
- అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం కంటే బయట ఉంచితేనే ఎక్కువ కాలం ఫ్రెష్‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటి తొక్క త్వరగా నల్లగా మారుతుందట.
- పుదీనా, కొత్తిమీర త్వరగా కుళ్లిపోకుండా ఉండటానికి, వాటిని పేస్ట్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాలని సూచిస్తున్నారు.
- పుదీనా, కొత్తిమీర కాడలను కట్ చేసి, గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయని చెబుతున్నారు.
- టమాటాలను కిలోలకొద్దీ కొంటారు కాబట్టి.. పండినవి, పచ్చిగా ఉన్నవి కలిపి తీసుకోవాలి. పచ్చివాటిని బయటే ఉంచి రెండు మూడు రోజుల తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు.
ఎక్కువ నీళ్లున్న కొబ్బరిబోండాన్ని - ఎలా గుర్తించాలి? - Identify Full Water Coconut