ETV Bharat / health

అలర్ట్​ - ఈ ఫుడ్స్​కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి! - These Foods Can Increase Stress - THESE FOODS CAN INCREASE STRESS

These Foods Can Increase Stress : 'ఒత్తిడి'.. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. అయితే చాలా మంది ఈ స్ట్రెస్‌ అనేది.. ఎక్కువ పని చేయడం, నిద్రలేమి వల్ల కలుగుతుందనుకుంటారు. కేవలం ఇవి మాత్రమే కాకుండా.. మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలూ ఒత్తిడిని పెంచుతాయంటున్నారు నిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం.

These Foods Can Increase Stress Levels
Stress Level Increasing Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 11, 2024, 4:23 PM IST

These Foods Can Increase Stress Levels : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో పని భారం, నిద్రలేమి వల్ల చాలా మంది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇవేకాకుండా మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా శరీరం ఒత్తిడికి లోనవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇంతకీ స్ట్రెస్​ను((Stress) పెంచే ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చక్కెర పదార్థాలు : చక్కెరతో చేసిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ అధికంగా ఉంటాయి. ఫలితంగా ఒత్తిడి, చిరాకు వంటివి కలుగుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి చక్కెరతో చేసిన పదార్థాలను అధికంగా తీసుకోకుండా.. వాటికి బదులుగా పండ్లు, తేనె వంటి సహాజ పదార్థాలను తీసుకోవడం మంచిది అంటున్నారు. ఎందుకంటే.. ఇవి తీపి తినాలనే కోరికను అదుపు చేయడంలో సహాయపడతాయంటున్నారు.

ప్రాసెస్ చేసిన ఫుడ్స్ : ఒత్తిడితో చిత్తవ్వకూడదంటే ప్రిజర్వేటివ్స్ కలిపి ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. అలాగే దీనిలో అనారోగ్యాన్ని కలిగించే కొవ్వులు కూడా ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి చిప్స్ వంటి ఇతరత్రా ఫ్రైడ్ స్నాక్స్​కి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

ఫ్రైడ్ ఫుడ్స్ : ఈ ఫుడ్స్ కూడా ఒత్తిడి పెరగడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఫ్రై చేసిన ఆహారంలో ఎక్కువ శాతంలో కొవ్వు ఉంటుంది. దాంతో అలాంటివి తినడం వల్ల బాడీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్​ని గ్రహించకుండా అడ్డుపడతాయి. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ : ఇటీవల కాలంలో చాలా మంది డయాబెటిస్ అదుపులో ఉంటుందనే ఉద్దేశంతో తీపి పదార్థాలకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్​ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. కానీ, ఇవి కూడా స్ట్రెస్ లెవల్స్ పెంచడానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇవి తీసుకోవడం వల్ల తెలియకుండానే చిరాకు, ఒత్తిడితో పాటు దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

2019లో 'అపెటైట్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కృత్రిమ స్వీటెనర్‌లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ బెంజమిన్ యాంగ్ పాల్గొన్నారు. ఆర్టిఫిషియల్ స్వీటెనర్​లు అధికంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువవుతాయని ఆయన పేర్కొన్నారు.

రిఫైండ్ పిండితో చేసిన ఆహారాలు : మీరు ఒత్తిడి బారినపడకుండా ఉండాలంటే మైదా పిండి వంటి రిఫైండ్ పిండితో చేసిన ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రిఫైండ్ పిండితో చేసిన బ్రెడ్, పేస్ట్రీస్ వంటి తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాకుండా జీర్ణసంబంధిత, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

టెన్షన్​తో భేజా ఫ్రై అవుతోందా? - ఇది నోట్లో వేసుకోండి - క్షణాల్లో హుష్ కాకి!

అధికంగా ఉప్పు ఉండేవి : సాధారణంగా ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని అందరికీ తెలుసు. కానీ, అధికంగా ఉప్పు ఉండేవి తినడం కారణంగా ఒత్తిడి కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. అలాగే భావోద్వేగాలు కూడా అదుపులో ఉండవంటున్నారు. అంతేకాదు.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో దీర్ఘకాలిక సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇవేకాకుండా ఒత్తిడిని కలిగించేవి మరికొన్ని ఉన్నాయి. అవేంటంటే.. నార్మల్​గా కొంతమంది ఒత్తిడిని తగ్గించుకునేందుకు కాఫీని తాగుతుంటారు. కానీ, బాడీలో కెఫీన్ ఎక్కువైనా సరే.. ఇబ్బందే అంటున్నారు నిపుణులు. ఇది వికారం, చిరాకును కలిగిస్తుందంటున్నారు. అలాగే.. ఆహారం అరుగుదలపైనా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అదేవిధంగా, పాల సంబంధిత ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో కొవ్వులు ఉన్న వాటికి దూరంగా ఉండాలంటున్నారు. ఎందుకంటే.. ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడితో పాటు భావోద్వేగాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రిలాక్స్ మోడ్​లోకి వెళ్లాలా? ఈ సినిమాలు చూస్తే మీ ఒత్తిడంతా ఉఫ్​! - Stress Buster Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.