ETV Bharat / health

చర్మం​ పొడిబారి పగుళ్లు ఏర్పడుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే నిగనిగలాడే స్కిన్​ మీ సొంతం! - Skin Peeling on Face Treatment

author img

By ETV Bharat Health Team

Published : Aug 27, 2024, 12:13 PM IST

Dry Skin Treatment: మీ చర్మం పొడిగా మారిందా? పొడి చర్మం కారణంగా స్కిన్​పై పగుళ్లు ఏర్పడి అందంగా కనిపించడం లేదా? అయితే డోంట్​ వర్రీ. ఈ చిట్కాలు పాటిస్తే మీ మునుపటి చర్మం మీకొస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Skin Peeling on Face Treatment
Skin Peeling on Face Treatment (ETV Bharat)

Skin Peeling on Face Treatment: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. కానీ, ఆధునిక జీవన శైలి, పెరిగిపోతున్న కాలుష్యం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు ఇబ్బందిపెడుతుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారి పగుళ్లు ఏర్పడతాయి. మరికొంతమందికి పగుళ్లు ఏర్పడి ఇన్​ఫెక్షన్స్​గా మారుతుంటాయి. ఇక వీటిని తగ్గించుకోవడానికి డాక్టర్లను సంప్రదించడం, క్రీములు వాడటం, సౌందర్య సాధనాలు ఉపయోగించడం, చిట్కాలు పాటించడం వంటివి చేస్తుంటారు. మరి మీ చర్మంపై కూడా పగుళ్లు ఏర్పడుతున్నాయా? అయితే డోంట్​ వర్రీ. ఈ టిప్స్​ పాటిస్తే మీ సమస్య తగ్గుతుందని అంటున్నారు. అయితే అంతకుముందు ఈ చర్మ సమస్యలు ఎందుకు వస్తాయి? అనే వివరాలు తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు ఈ సమస్యలు: వాస్తవానికి వాతావరణ సమస్యలు, మందుల వల్ల ఈ సమస్య వస్తుందని.. పిల్లల్లో కొందరికి వారసత్వంగానే పొడి చర్మం వస్తుందని ప్రముఖ డెర్మటాలజిస్ట్​ డాక్టర్​ స్వప్న ప్రియ అంటున్నారు. అలాగే జన్యులోపంతో పుట్టడం, శరీరంపై ఆయిల్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల కూడా ముడతలు రావడం, అరచేతులు మందంగా అయ్యి చర్మంపై పగుళ్లుగా ఏర్పడతాయని చెబుతున్నారు. తుమ్ములు, కళ్లలో దురద, ఆస్తమా, వారసత్వ వ్యాధులు ఉన్నప్పుడు కూడా చర్మంపై పగుళ్లు ఏర్పడుతాయని అంటున్నారు.

మధ్య వయసులో ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ముందుగా మీరు ఏదైనా మందులు వాడుతుంటే వాటిని చెక్ చేసుకోవాలని.. మొటిమలు, కొలెస్ట్రాల్​ తగ్గడం లాంటి సమస్యలకు వాడే మందుల వల్ల కూడా చర్మంపై పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. కొందరి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే వాటి వల్ల కూడా చర్మ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అలాగే కొందరు వాకింగ్​ చేయడానికి బయటకు వెళ్లినప్పుడు పొదలు, చెట్లు, అడవి లాంటి ప్రదేశాల్లో తిరుగుతారు. అలాంటి సమయంలోనూ ఈ చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చర్మం పొడి బారి పగుళ్లు ఏర్పడి.. ఇన్​ఫెక్షన్​గా మారేంతలా ఉందంటే అది తప్పకుండా తీవ్రంగా పరిగణించాలని.. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలని చెబుతున్నారు.

చర్మ పగుళ్లు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు:

  • స్నానానికి ముందు బాడీకి ఆయిల్ అప్లై చేసుకోవాలి.
  • స్నానం చేసేటప్పుడు మాయిశ్చరైజ్​ ఉన్న సబ్బులను ఉపయోగించాలి.
  • నురుగు రాకుండా ఉండే లోషన్లు, సబ్బులు వాడాలి
  • స్నానం చేసే సమయం 5-10 నిమిషాల మధ్య ఉండేలా చూసుకోవాలి
  • స్నానం చేసే నీరు గోరువెచ్చగా ఉండాలి.
  • స్నానం అవ్వగానే కొద్దిగా తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్​ రాసుకోవాలి.
  • వీలైతే శరీరానికి పెట్రోలియం జెల్​ను వాడడం మంచిది.

మాయిశ్చరైజర్​ ఎన్నిసార్లు వాడాలి: మాయిశ్చరైజర్​ను ఎన్ని సార్లు అప్లై చేయాలనేది మనిషి శరీర తత్వాన్ని బట్టి ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి 4-5 సార్లు అప్లై చేస్తే సరిపోతుందని.. కానీ కొందరికి మాత్రం రోజులో 10 సార్లు వాడాల్సిన అవసరం ఉంటుందంటున్నారు డాక్టర్​ స్వప్న ప్రియ. వాసలిన్, పెట్రోలియం జెల్​ కాకుండా చర్మం పొడి బారకుండా ఉండాలంటే మాయిశ్చరైజర్​ను వాడాలని సూచిస్తున్నారు. వాసలిన్, పెట్రోలియం జెల్​ను వాడుతూనే ఇవి వాడడం వల్ల చర్మం పగుళ్లు రాకుండా మృదువుగా మారుతుందని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

యూరిక్ యాసిడ్​ ఎక్కువై ఇబ్బందిపడుతున్నారా? - ఈ ఆహారాల జోలికి వెళ్లకుంటే ఇట్టే తగ్గిపోతుంది!! - uric acid avoid food list in telugu

40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్​గా వెయిట్​ లాస్​! - weight loss after 40 years old

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.