Actor Shobitha Suicide Case Update : హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో ఆదివారం ఉరేసుకొని చనిపోయిన కన్నడ సీరియల్ నటి శోభితది ఆత్మహత్యేనని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. శోభిత మృతిపై కుటుంబసభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.. కుటుంబ సభ్యులకు శోభిత మృతదేహాన్ని అప్పగించినట్లు డీసీపీ వినీత్ చెప్పారు. ఈ కేసు విషయంలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు.
అసలేం జరిగింది : ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇంటికి చేరుకున్న పోలీసులు ఆమె ఇంట్లో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తులో భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసులు గుర్తించారు. మానసికంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నారు. శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు ఇంటి చుట్టుపక్కల వారి స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డు చేశారు.
బెంగళూరు మాట్రిమోనీలో శోభిత ప్రొఫైల్ చూసి సుధీర్ పెళ్లి ప్రపోజల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి అనంతరం ఆమె సీరియళ్లు చేయడం మానేశారు. శోభిత చివరిసారి ఎవరెవరితో మాట్లాడిందో కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు శోభిత మృతదేహాన్ని బెంగళూరుకి తరలించే అవకాశం ఉంది.
అత్త-కోడలు మధ్య వివాదం - ఉరేసుకుని వివాహిత బలవన్మరణం - అత్తింటిపై తల్లిదండ్రుల దాడి