ETV Bharat / health

మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్​ గ్యారెంటీ! - Skin Care Tips

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 4:57 PM IST

Should Never Share These Beauty Products : అందంగా కనిపించాలని చాలా మంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు తాము వాడే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇతరులతో షేర్ చేసుకుంటుంటారు. మీకు అలాంటి హ్యాబిట్ ఉందా? అయితే మీకో బిగ్ అలర్ట్! ముఖ్యంగా వీటిని ఎప్పుడూ ఇతరులతో పంచుకోవద్దంటున్నారు. అవేంటంటే?

Should Never Share These Beauty Products
AVOID BEAUTY PRODUCTS SHARING (ETV Bharat)

These Beauty Products You Should Never Share : కొంత మంది మహిళలు తమ బ్యూటీ ప్రొడక్ట్స్​ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటూ ఉంటారు. లిప్‌స్టిక్ నుంచి మేకప్ బ్రష్ దాకా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఇలా చేయడం వల్ల చర్మానికి(Skin) హాని కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఏయే ఉత్పత్తులను ఇతరులతో పంచుకోకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ : చాలా మంది మహిళలు ఎక్కువగా చేసే పొరపాటు ఏంటంటే.. రంగు బాగుందనో లేక మంచి లుక్ ఇస్తుందనో ఇతరుల లిప్‌స్టిక్/ లిప్‌గ్లాస్ యూజ్ చేస్తుంటారు. అయితే.. మీకు ఇలాంటి అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోవాలంటున్నారు నిపుణులు. ఇతరులవి యూజ్ చేసినప్పుడు వాటిపై ఉన్న బ్యాక్టీరియా మీ పెదవుల పైకి చేరే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

"Journal of the American Academy of Dermatology" అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. లిప్​గ్లాస్‌ను పంచుకునే యువతులు ఇతరుల కంటే పెదాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం 6 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో శాన్​ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జె. ఓల్గా లోజ్ పాల్గొన్నారు. లిప్​గ్లాస్ పంచుకునే వారు.. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్(HSV) 1, హెచ్​ఎస్​వీ 2, స్టాఫిలోకాకస్ ఆరియస్ వంటి బ్యాక్టీరియాతో సహా పెదాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని లోజ్ పేర్కొన్నారు.

పౌడర్ రూపంలో ఉండే ప్రొడక్ట్స్ : కొంతమంది మహిళలు పౌడర్ రూపంలో ఉండే మేకప్‌లో ఉపయోగించే ఫౌండేషన్, ఐ షాడో.. వంటివి షేర్ చేసుకుంటుంటారు. అయితే, వీటిని ఒకరి కంటే ఎక్కువమంది చేతితో తాకినా లేదా బ్రష్‌తో అప్త్లె చేసుకున్నా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఫలితంగా మొటిమలు రావడం, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరడం.. వంటి సమస్యలు రావచ్చొంటున్నారు.

డైలీ ఈ ఫేస్‌ప్యాక్‌లు ట్రై చేశారంటే- మేకప్‌ లేకుండానే మెరిసిపోవచ్చు!

కళ్ల సంబంధిత ప్రొడక్ట్స్ : కంటికి సంబంధించిన మేకప్ ఉత్పత్తులైన ఐ షాడో, మస్కారా, ఐ లైనర్.. వంటివి షేర్​ చేసుకోవద్దని చెబుతున్నారు. వారికి ఏమైనా కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉంటే అవి మీకు వచ్చే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అలాగే.. ఆ ఉత్పత్తుల్లోని బ్యాక్టీరియా వల్ల కళ్లు ఎర్రబడడం, నీళ్లు కారడం, మండడం.. వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని సూచిస్తున్నారు.

మేకప్ బ్రష్‌ : మీరు మేకప్ కిట్ యూజ్ చేస్తున్నట్లయితే.. మేకప్ బ్రష్​ను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇతరులు వాటిని యూజ్ చేసినప్పుడు వారి చర్మం మీద ఉండే బ్యాక్టీరియా, క్రిములు.. వంటివి మేకప్ ప్రొడక్ట్స్​లోకే కాదు.. వాటిని తిరిగి మీరు యూజ్ చేసినప్పుడు మీ చర్మం మీదకు కూడా చేరతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే.. మేకప్ బ్రష్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు ఇతరులతో షేర్ చేసుకోకుండా ఉండడం మంచిది అంటున్నారు.

వీటిని కూడా : లిక్విడ్ ఐ లైనర్, లిక్విడ్ ఫౌండేషన్, క్రీమ్ రూపంలో ఉండే ప్రొడక్ట్స్, హెయిర్ బ్రష్‌లు, నెయిల్‌పాలిష్, క్లెన్సింగ్‌కి ఉపయోగించే స్పాంజ్‌లు, చిన్న చిన్న సీసాల్లో లభ్యమయ్యే మూతలు ఉండే కొన్ని రకాల క్రీమ్​లు, పౌడర్లు, మేకప్ వేసుకోవడానికి వాడే పఫ్‌లు, ఐ లాష్ కర్లర్, ట్వీజర్స్, ప్లక్కర్స్, లిప్‌బామ్, స్నానానికి ఉపయోగించే ప్రొడక్ట్స్, సాధనాలు.. మొదలైనవన్నీ ఇతరులతో పంచుకోకుండా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజ్​ వాటర్​ను డైలీ వాడుతున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా? - BENEFITS OF ROSE WATER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.