ETV Bharat / health

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉందా? - అయితే, మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - Saunf Health Benefits - SAUNF HEALTH BENEFITS

Saunf Health Benefits : భోజనం తర్వాత సోంపు తినడం చాలామందికి అలవాటే. మీక్కూడా ఈ అలవాటు ఉందా? మరి.. సోంపు గింజలు తినడం ద్వారా మీ శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Health Benefits Of Fennel Seeds
Saunf Health Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 10:45 AM IST

Health Benefits Of Fennel Seeds : చాలా మందికి భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. అలాగే.. పెళ్లిళ్లు, శుభకార్యాలతోపాటు రెస్టారెంట్లలోనూ సోంపు అందుబాటులో ఉంచుతారు. హోటల్స్​, రెస్టారెంట్స్​లోనూ భోజనం చివర్లో దీన్ని ప్రత్యేకంగా అందిస్తారు. అందుకు ప్రధాన కారణం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుందనే. అయితే.. సోంపు(Saunf) తినడం వల్ల కేవలం ఆహారం జీర్ణమవ్వడమే కాదు ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యల నుంచి బిగ్ రిలీఫ్ : నేటి రోజుల్లో చాలా మంది ఫాస్ట్​ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, ఇతర ఆహారాలు తినడం కారణంగా రకరకాల జీర్ణసమస్యలను ఎదుర్కొంటుంటారు. అలాంటి టైమ్​లో సోంపు తినడం ద్వారా మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకాన్ని నివారించడంలో సోంపులో ఉండే జీర్ణ రసాలు, ఎంజైమ్​లు చాలా బాగా సహాయపడుతాయంటున్నారు నిపుణులు.

2017లో "Evidence-Based Complementary and Alternative Medicine" జర్నల్​లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. భోజనం తర్వాత సోంపు గింజలు తిన్న వ్యక్తులలో కడుపు నొప్పి, అజీర్ణం వంటి లక్షణాలు తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో లక్నోలోని కింగ్ జార్జ్స్ మెడికల్ కాలేజీకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ S.K. సింగ్ పాల్గొన్నారు. సోంపు గింజలలో ఉండే జీర్ణ రసాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.

జీవక్రియ రేటు మెరుగుపడుతుంది : సోంపు గింజలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో సహజ నూనెలైన ఫెన్సోన్, అనెథోల్, ఎస్ట్రాకోల్ వంటివి ఉంటాయి. ఇవన్నీ శరీర జీవక్రియ రేటును పెంపొందించడానికి తోడ్పడతాయని చెబుతున్నారు నిపుణులు.

ఉదయాన్నే సోంపు నీళ్లను తాగితే - ఈ అనారోగ్య సమస్యలు దూరం!

నోటి దుర్వాసన తగ్గిస్తాయి : సహజమైన మౌత్ ఫ్రెషనర్​గా సోంపు గింజలు పనిచేస్తాయంటున్నారు నిపుణులు. నోటి దుర్వాససను తొలగించడంలోనూ ఇవి ముందు వరుసలో ఉంటాయని చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే కొద్దిగా తీసుకుంటే ఈ సమస్య నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.

బీపీ కంట్రోల్ : సోంపులో పోటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును(Blood Pressure) నియంత్రణలో ఉంచడంలో చాలా బాగా సహాయపడుతాయంటున్నారు. అలాగే వీటిలో ఎక్కువగా ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు. అదేవిధంగా ఈ గింజలలో ఉండే A విటమిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందంటున్నారు.

చర్మ ఆరోగ్యానికి మేలు : సోంపు తినడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్​తో పోరాడతాయి. ఫలితంగా.. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

సోంపుని ఇలా తీసుకోండి : భోజనం తర్వాత కాస్త సోంపు తినండి. లేదంటే సోంపు గింజలను నీటిలో మరిగించి, వడగట్టి కొద్దిగా తేనె కలుపుకొని తాగొచ్చు. అలాగే మీ మసాలా దినుసులలో కలిపి వంటకాలలో యూజ్ చేయవచ్చు. ఫలితంగా వంటకాలకు మంచి రుచి రావడమే కాకుండా ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ సోంపు గింజలను ఇలా తీసుకున్నారంటే - డయాబెటిస్​కు ఈజీగా చెక్ పెట్టొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.