ETV Bharat / health

మీ బ్రెయిన్​కు​ రెస్ట్​ ఇస్తున్నారా - సైన్స్​ చెబుతున్న ఆశ్చర్యకర విషయాలు!

Rest for Brain: నేటి బిజీ బిజీ లైఫ్​లో ఏ ఒక్క‌రూ ఆగి ప్ర‌శాంతంగా ఆలోచించే ప‌రిస్ధితిలో లేరు. ప‌లు ఆలోచ‌న‌ల‌తో మ‌న మెదడులో నిరంత‌ర మేథోమ‌ధ‌నం, సంఘ‌ర్ష‌ణ చెల‌రేగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో మెద‌డుకు తగిన విశ్రాంతి క‌ల్పించ‌డం కీల‌క‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. అందుకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Rest for Brain
Rest for Brain
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 7:19 AM IST

Rest for Brain: మీరు గమినించారో లేదో.. కంప్యూటర్​ను కూడా మనం కంటిన్యూగా పని చేయించము. దానికి రెస్ట్ ఇవ్వకపోతే త్వరగా పాడైపోతుందని మనకు తెలుసు. మరి.. ఇదే సూత్రం మెదడుకు వర్తించదా? ఆ విషయం మనకు తెలియదా? తెలుసు.. కానీ మనలో చాలా మంది పట్టించుకోరు. బ్రెయిన్​కు రెస్ట్ ఇవ్వాలనే విషయాన్నే మరిచిపోతారు. అలా చేయొద్దంటున్నారు నిపుణులు. మెదడుకు చక్కటి విరామం ఇస్తే.. మరింత యాక్టివ్‌గా పనిచేయడంతోపాటు.. క్రియేటివిటీతో ఆలోచిస్తుందని చెబుతోంది లెక్సిస్‌నెక్సిస్‌ సర్వే. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

మంచి నిద్ర : ఆరోగ్యంగా ఉండటానికి సరైన ఆహారం ఎంత అవసరమో.. శరీరానికి తగినంత నిద్ర కూడా అవసరమే. మనిషి రోజుల్లో కనీసం 7 గంటలైనా నిద్ర పోవాలని సూచిస్తున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ప్రతి రాత్రి ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో.. గుండెపోటు, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి నిరాశతో సహా పలు శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజులో తగినంత నిద్ర పోవడం ముఖ్యం.

శారీరక వ్యాయామం: శరీరం ఆరోగ్యంగా ఉండటానికే కాదు.. బ్రెయిన్​ రిలాక్స్​ కావడంలోనూ వర్కవుట్స్​ యూజ్​ అవుతాయి. యోగా వంటివి మన మెదడును 'తక్కువ పని' చేసేలా చేస్తాయి. ఇలాంటప్పుడు మెదడుకు కొంత విశ్రాంతి లభిస్తుంది. అంతేకాదు.. వ్యాయామం చేసినప్పుడు.. మెదడు సెరోటోనిన్, ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఇవి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.

మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్​ అయిపోతుంది!

సరిగ్గా తినడం: మనం తీసుకునే ఆహారం.. ఆరోగ్యకరమైన జీవనశైలి, అలాగే మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతో సహా చాలా మార్గాల్లో సహాయపడుతుంది. నిజానికి, సరైన పోషకాహారాన్ని తినడం వల్ల కూడా మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్లు, ఖనిజాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మనం ఆరోగ్యంగా తిన్నప్పుడు.. మానసిక సంతృప్తిని ఫీలవుతుంటాం. అది ఇందులో భాగమే!

బ్రేక్‌లు: పనిలో పడితే చాలా మంది బాడీకి, మైండ్​కు రెస్ట్​ ఇవ్వడం మర్చిపోతారు. కానీ పని సమయాల్లో చిన్న చిన్న విరామాలు చాలా ముఖ్యమైనవి. తరచుగా, పని చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు లేదా ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు ఇది మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి.. ఇటువంటి సమయాల్లో కూసింత బ్రేక్​ తీసుకోవడం మంచిది. చిన్న విరామాలు తీసుకోవడం వల్ల మైండ్​ రిఫ్రెష్​ అవ్వడమే కాకుండా, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చని 2021లో US హెల్త్ డిపార్ట్‌మెంట్ చేసిన అధ్యయనంలో స్పష్టమైంది.

డిజిటల్ డిటాక్స్: ఇక ప్రస్తుత కాలంలో చాలా మంది టైం దొరికితే చాలు ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల మెదడుపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఫోన్లు, ఇతర గాడ్జెట్స్​ వాడటాన్ని బంద్​ చేసుకోవాలి. ఈ సమయాన్ని సంగీత వాయిద్యం వాయించడం లేదా పెయింటింగ్, కుకింగ్​ వంటి ఇతర కార్యకలాపాలలో పాల్గొనడం వంటివి చేయవచ్చు. ఇలాంటివి మీ మెదడును పునరుద్ధరించడానికి సహాయపడతాయి.

బాగా విశ్రాంతి తీసుకున్న మెదడు ఎలా ఉంటుంది?: బాగా విశ్రాంతి పొందిన మైండ్​ రీఫ్రెష్‌గా, అప్రమత్తంగా, ఏకాగ్రతతో ఉంటుంది. ఇంకా.. ఆలోచించడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సవాళ్లను కూల్​గా మేనేజ్ చేసేలా చేస్తుంది.

రోజూ ఈ వ్యాయామాలు చేస్తే - మీ బ్రెయిన్ పవర్ ఓ రేంజ్​లో పెరుగుతుంది!

అలర్ట్ - రాత్రివేళ బెడ్ ఎక్కి ఫోన్​ పట్టుకుంటున్నారా? మీ మెదడులో జరిగే ప్రమాదకర మార్పులివే!

మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - మీకు "బ్రెయిన్​ ఫాగ్"​ ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.