Phone Light Affects Sleep : 'రాత్రంతా నిద్రే లేదు'- మనం చాలా తరుచుగా వినే మాటలు ఇవి. చాలా మంది రాత్రి వేళల్లో నిద్ర పట్టక సతమతమవుతుంటారు. అయితే సాంకేతికతకు నిద్రకు ఏమైనా సంబంధం ఉందా అంటే లేదని చెప్పలేం. కానీ రాత్రి వేళల్లో ఫోన్, ల్యాప్‌టాప్‌ను చూస్తూ ఉండడం వల్ల నిద్ర దూరమవుతుందని మనం చాలాసార్లు వినే ఉంటాం. ఫోన్, ల్యాప్‌టాప్‌ల స్క్రీన్స్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి మనకు నిద్ర పట్టకుండా చేస్తుందని చాలా మంది అంటుంటారు. అందుకు నిద్ర వేళకు ముందు బెడ్‌రూమ్‌లో ఫోన్ వాడకూడదని నిపుణులు చెప్తుండడం కూడా మనం వింటూ ఉంటాం. అయితే చాలా ఫోన్ కంపెనీలు కళ్లు దెబ్బ తినకుండా ఉండేందుకు తమ ఫోన్లలో నైట్ మోడ్ కూడా ఏర్పాటు చేస్తుంటాయి. అయితే నిజంగానే బ్లూ రేస్ వల్ల మనకు నిద్ర దూరమవుతుందా? దీని గురించి అసలు సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం.
స్వీడన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌కు చెందిన స్లీప్ ఎక్స్పర్ట్ బృందం దీనిపై విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఈ అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఫోన్‌లు, ల్యాప్‌టాప్ స్క్రీన్స్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి వల్ల సగటున మూడు నిమిషాల కంటే తక్కువ సమయం మాత్రమే నిద్రకు భంగం కలుగుతుందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనాన్ని ఆషామాషీగా మాత్రం చేయలేదు. అన్ని వయసుల్లో ఉన్న లక్ష 13,370 మందిని పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు. అయితే సాంకేతికత వినియోగానికి, నిద్రకు మధ్య సంబంధం ఉందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. సాంకేతికతకు నిద్రకు మధ్య సంబంధం చాలా సంక్లిష్టమైనదని ఈ అధ్యయనం తెలిపింది.
మూడు నిమిషాల్లోపే నిద్ర
రాత్రి పడుకోవడానికి ముందు నీలి కాంతిని విడుదల చేసే ప్రకాశవంతమైన స్క్రీన్‌ను చూసిన వ్యక్తులు సగటున 2.7 నిమిషాలు ఆలస్యంగా నిద్రపోయారు. కొన్ని అధ్యయనాలలో ప్రజలు ప్రకాశవంతమైన స్క్రీన్‌ను ఉపయోగించిన తర్వాత బాగా నిద్రపోతారని కూడా తేలింది. వీడియో గేమ్‌లతో పోలిస్తే టీవీ చూసే వారిలో 3.5 నిమిషాలు ఎక్కువగా నిద్రను కోల్పోయారు. అయితే టెక్స్ట్ మెసేజ్‌లు చేసే వారు మాత్రం రాత్రి నిద్రకు దూరమవుతున్నట్లు గుర్తించారు.
నిద్రను ప్రభావితం చేస్తుందా?
బ్లూ లైట్ సిద్ధాంతంలో మెలటోనిన్, నిద్రను నియంత్రించే హార్మోన్ ఉంటుంది. పగటిపూట అధిక మొత్తంలో నీలి కాంతికి, సహజ కాంతికి గురవుతాము. ఈ ప్రకాశవంతమైన నీలిరంగు కాంతి మన కళ్ల వెనుక భాగంలోని కొన్ని కణాలను ఉత్తేజం చేస్తుంది. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని మన మెదడుకు సంకేతాలను పంపుతుంది. కానీ రాత్రిపూట కాంతి తగ్గినప్పుడు, మన మెదడు మెలటోనిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇది మనం నిద్రపోయేలా చేస్తుంది. పరికరాల నుంచి వచ్చే కృత్రిమ కాంతి మెలటోనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుందని, మన నిద్రను ప్రభావితం చేస్తుందని అనుకోవడం అంతా ఒక భావనని తేలింది.
ప్రకాశవంతమైన కాంతి- నిద్ర, చురుకుదనాన్ని ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి పరికరాల నుంచి వచ్చే కాంతి నిద్రకు భంగం కలిగించేంత ప్రకాశవంతంగా లేదని ఈ పరిశోధన తేల్చింది. నిద్రను ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. అయితే ప్రకాశవంతమైన నీలి కాంతి వాటిలో ఒకటి కాదని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. అయితే తరచుగా ఫోన్‌ని చూడడం కళ్లకు మంచిది కాదని తెలిపింది. అందుకే, మీ శరీరం నిద్రను కోరుకున్నప్పుడు ఫోన్ ఆఫ్ చేసి ప్రశాంతంగా పడుకోవాలని అధ్యయనం చేసిన వారు సూచిస్తున్నారు.
గుడ్ స్లీప్, ఫుల్ ఖుషీ! ఏ టైంలో స్నానం చేస్తే సుఖంగా నిద్రపోవచ్చో తెలుసా? - Showering Before Bed
నిమ్మకాయను కట్ చేసి బెడ్‌రూమ్‌లో పెడితే చాలు- అందరికీ డీప్ స్లీప్ పక్కా! - Lemon In Bedroom