Peanut Vs Makhana Which is a better for Weight loss : వేరుశనగలు, మఖానా.. ఈవెనింగ్ టైం లో స్నాక్స్ కోసం బెస్ట్ ఆప్షన్. అందుకే చాలా మంది వీటితో రకరకాల వెరైటీలు చేసుకుని తింటుంటారు. అంతేనా వీటిలోని పోషకాలు పలు ఆరోగ్య ప్రయోజనాలను సైతం అందిస్తాయి. అందులో వెయిట్ లాస్ కూడా ఒకటి. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది ఎఫెక్టివ్ అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. మరి దీనిపై నిపుణులు సమాధానం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం
వేరుశనగ : వేరుశనగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా వేరుశనగ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, వేరుశనగను మితంగా తీసుకోవడం వల్ల బరువు పెరగకుండా చూడొచ్చని, ఆకలిని తగ్గించుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాకుండా వీటిలోని పోషకాలు.. జీర్ణక్రియ రేటును పెంచడంతో పాటు, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు. అలాగే గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయని పేర్కొన్నారు.
జీడిపప్పు Vs బాదం - బరువు తగ్గడానికి ఇది బెటర్ ఆప్షన్!
మఖానా (తామర గింజలు) : మఖానాలో పొటాషియం, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, కండర ద్రవ్యరాశిని(Muscle Mass)పెంచడానికి సహాయపడతాయి. అలాగే మఖానాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. భోజనానికి ముందు మఖానా తినడం వల్ల ఎక్కువ తినకుండా నియంత్రించుకోవచ్చు. ఇంకా మఖానా తినడం వల్ల గుండె సమస్యలు, నిద్రలేమి, సంతానోత్పత్తి సమస్యలు, మధుమేహం వంటివి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రెండింటిలో ఏది బెటర్ ?: వేరుశనగ, మఖానా రెండింటిలో కూడా పోషకాలు సమానంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయపడతాయి. అయితే, క్యాలరీల పరంగా చూస్తే వేరుశనగ కంటే మఖానా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు స్నాక్స్‌గా మఖానా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడం కాకుండా.. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే రెండింటిని తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే, ఏది తిన్నా కూడా మితంగా తీసుకోవాలని అంటున్నారు.
2018లో 'జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటాబాలిజం' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. 8 వారాల పాటు రోజుకు 50 గ్రాముల మఖానా తిన్న వ్యక్తులు బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో దిల్లీలోని జాతీయ పోషకాహార సంస్థకు చెందిన 'డాక్టర్ శోభా శర్మ' పాల్గొన్నారు. మఖానాలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
సూపర్ న్యూస్ : బరువు తగ్గాలంటే ఈ రొట్టె తినండి - కొవ్వును పిండేస్తుంది!
అద్భుతం: బరువు తగ్గడం నుంచి గుండె జబ్బుల నివారణ దాకా - తేనె ఇలా తీసుకుంటే అమృతమే!