ETV Bharat / health

అలర్ట్ : మౌత్‌వాష్‌ వాడటం మంచిదేనా? - నిపుణులు ఏమంటున్నారు?? - Mouthwash Benefits And Risks - MOUTHWASH BENEFITS AND RISKS

Mouthwash Benefits And Risks : ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు మౌత్‌వాష్‌ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి.. నోటి ఆరోగ్యం కోసమంటూ ఇలా మౌత్‌ వాష్‌ ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం కూడా కలుగుతుంటుంది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

Mouthwash Benefits And Risks
Mouthwash Benefits And Risks
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 17, 2024, 5:13 PM IST

Mouthwash Benefits And Risks : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నోటి శుభ్రత చాలా ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. నోరు పరిశుభ్రంగా ఉంటే.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే.. కొంత మందిని నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు వేధిస్తుంటాయి. దీనివల్ల తాజా శ్వాస కోసం మౌత్‌వాష్‌తో నోరు క్లీన్‌ చేసుకుంటారు. మరి.. ఇలా రోజూ మౌత్‌వాష్‌ ఉపయోగించడం మంచిదేనా? దీన్ని వాడటం వల్ల ఏమవుతుంది? నిపుణులు ఏమంటున్నారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

మౌత్‌వాష్‌ వల్ల ప్రయోజనాలు :

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మౌత్‌వాష్‌ను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీసెప్టిక్‌ లక్షణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయని అంటున్నారు.
  • అలాగే మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కున్న ఆహారం మొత్తం తొలగిపోతుందని పేర్కొన్నారు.
  • కొంత మంది తాజా శ్వాస రావడం కోసం మౌత్‌వాష్‌లను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది.
  • ఫ్లోరైడ్‌ ఉండే మౌత్‌వాష్‌లను వాడటం వల్ల దంతలు ఆరోగ్యంగా ఉంటాయట.
  • అలాగే చిగుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేసి, వాపు సమస్యలను తగ్గిస్తుందని నిపుణులంటున్నారు.
  • మౌత్‌వాష్‌లను యూజ్‌ చేయడం వల్ల దంతాలపై ఉన్న మరకలు తొలగిపోతాయి. ఇంకా మెరిసేలా చేస్తాయని అంటున్నారు.
  • ఇంకా మౌత్‌వాష్‌లను వాడటం వల్ల నోటిలో ఏర్పడే పుండ్లు కూడా తగ్గుతాయట.

మౌత్‌వాష్‌ల వల్ల కలిగే నష్టాలు :
ఆల్కాహాల్‌ ఉండే మౌత్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల నోరు పొడిబారుతుంది. 2018లో "క్లినికల్ ఎక్స్‌పీరిమెంటల్ డెంటిస్ట్రీ" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఆల్కాహాల్-ఆధారిత మౌత్‌వాష్ ఉపయోగించిన వారిలో లాలాజలం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని యూనివర్సిడేడ్ ఫెడరల్ డి మినాస్ గెరైస్ (Universidade Federal de Minas Gerais) విశ్వవిద్యాలయంలో పని చేసే డాక్టర్ ఫెర్నాండో డోస్ రియోస్ పాల్గొన్నారు. ఆల్కహాల్‌ ఉన్న మౌత్‌వాష్‌లు ఉపయోగించిన వారిలో లాలాజలం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.

  • ఇంకా మౌత్‌వాష్‌లలో ఉండే కొన్ని రకాల కెమికల్స్‌ నోటి పుండ్లకు దారితీస్తాయట.
  • అలాగే ఎక్కువ రోజులు కొన్ని రకాల మౌత్‌వాష్‌లను వాడటం వల్ల దంతాలు రంగు మారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • కాబట్టి.. రోజుకు రెండు సార్లు మాత్రమే ఒక నిమిషం పాటు మౌత్‌వాష్‌తో నోటిని శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • మౌత్‌వాష్‌ను మింగవద్దని సూచిస్తున్నారు.
  • ఇంకా మౌత్‌వాష్‌ను డాక్టర్ల సలహా ప్రకారం మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్​: శానిటైజర్​ డైలీ వాడుతున్నారా? - ఏకంగా మెదడుకే ముప్పు! - Side Effects of Using Sanitizer

సమ్మర్​లో జింజర్, లెమన్ వాటర్ తాగుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా? - Ginger Lemon Water Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.