Lifestyle Mistakes to Cause Brain Stroke: శరీరంలో గుండె తర్వాత అతి ముఖ్యమైన అవయవం బ్రెయిన్. కాగా, మెదడు కణాలకు ఆక్సిజన్ అవసరం. ఈ ఆక్సిజన్ రక్తం ద్వారా అందుతుంది. మెదడు కణాలకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ వ్యాధిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. వీరిలో 5 మిలియన్ల మంది చనిపోగా, మరో 5 మిలియన్ల మంది శాశ్వతంగా వికలాంగులుగా మిగిలిపోయారు. ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయసు వారిలో ఈ సమస్య కనిపించేది.. ప్రస్తుతం 40 వయసు వారిని కూడా ఇది బాధిస్తుంది. అయితే బ్రెయిన్ స్ట్రోక్‌కు ప్రధాన కారణాలలో హైబీపీ ఒకటని WHO పేర్కొంది. అంతేకాకుండా మన రోజువారీ జీవనశైలి అలవాట్లు కూడా ఎక్కువ ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
పోషకాలు లేని ఆహారం: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ట్రాన్స్‌ఫ్యాట్, కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉండే ఆహారాలను తింటున్నారు. అయితే ఈ ఆహారాలు అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలను పెంచుతాయి. కాగా, ఈ రెండూ ఎక్కువగా స్ట్రోక్‌కి కారణమవుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
శారీరక శ్రమ లేకపోవడం: నిశ్చల జీవనశైలి అంటే గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం, వ్యాయామం వంటివి చేయకపోవడం ఊబకాయం, అధిక రక్తపోటుకు కారణమయ్యి తద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే శారీరక శ్రమ అవసరమని.. అందుకోసం ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. ఇవి చేయడం వల్ల బరువు కంట్రోల్ అవ్వడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
2018లో ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. శారీరక శ్రమలేని వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 25శాతం ఎక్కువని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో న్యూట్రిషన్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డా. స్కాట్ లీ పాల్గొన్నారు. వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం 22 శాతం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
మీ డైట్‌లో ఈ రసాలుంటే - ఈజీగా బరువు తగ్గొచ్చు! - Rasam Recipe For Weight Loss
స్మోకింగ్ అండ్ డ్రికింగ్: స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ రెండూ ఆరోగ్యాన్ని హరించేవే. వీటిని మానుకోమని వైద్యులు ఎన్నిసార్లు చెప్పినా అలవాటు పడ్డవారు మాత్రం దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. అయితే స్మోకింగ్, డ్రింకింగ్ రెండూ బ్రెయిన్ స్ట్రోక్ కారణాలు అని నిపుణులు అంటున్నారు. స్మోకింగ్ రక్తనాళాలను దెబ్బితీస్తుందని, రక్తపోటును పెంచుతుందని చెబుతున్నారు. ఈ రెండు అలవాట్లు ఎంత తొందరగా మానుకుంటే బ్రెయిన్ అంత ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు. 2021లో BMJ(British Medical Journal) జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ధూమపానం, మద్యపానం రెండూ తాగే వ్యక్తులకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 80% ఎక్కువ అని కనుగొన్నారు.
ఒత్తిడి: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడితో చిత్తతవుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి.. హైబీపీ, ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దోహదం చేస్తుందని అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు వ్యాయమాలు చేయడం, యోగా లేదా థెరపీ వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అంటున్నారు.
నిద్ర లేకపోవడం: మనిషికి కంటి నిండ నిద్ర ఉంటేనే ఏ పనైనా శ్రద్ధగా చేయగలుగుతారు. అలాంటి నిద్రకు మెజార్టీ జనాలు మంగళం పాడుతున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం ఎక్కువై నిద్ర పోవడానికి బద్ధకిస్తున్నారు. సరిపడా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసిందే. వాటితో పాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఎటాక్ అవుతుందని నిపుణులు అంటున్నారు. అందుకని రోజు రాత్రి 7 నుంచి 9 గంటల నిద్ర పోయేలా చూసుకోవాలని, స్లీప్ అప్నియా సమస్యలు ఉంటే చికిత్స చేయించుకోవాలని అంటున్నారు.
నెల రోజులు ఉల్లిపాయ తినకపోతే - మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా? - Onions Health Benefits
దీర్ఘకాలిక వ్యాధులను పట్టించుకోకపోవడం: హైబీపీ, షుగర్, హై కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక సమస్యలకు తగిన చికిత్స తీసుకోకపోతే బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంటున్నారు.
స్ట్రోక్ లక్షణాలను విస్మరించడం: నడవలేకపోవడం, ముఖం ఓ వైపు వంగిపోవడం, కాళ్లు, చేతులు బలహీనంగా మారడం, రెండు చేతులని పైకి లేపలేకపోవడం, మాట్లాడలేకపోవడం, మాట్లాడినప్పుడు ఇబ్బందిగా ఉండడం, తలనొప్పి, వికారం లేదా వాంతులు, సృహ తప్పడం వంటి లక్షణాలను నెగ్లెక్ట్ చేయడం వంటివి చేసినప్పుడు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్‌ని కలవడం లేదా అంబులెన్స్‌కి కాల్ చేయడం ముఖ్యమని సూచిస్తున్నారు.
విజయం మీ కాళ్ల దగ్గరకు రావాలా? - అయితే ఉదయం 7 గంటల్లోపు ఈ పనులు చేసేయండి! - Things To Do Before 7 AM