Military Trick Sleep in 2 Minutes: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల చాలా మందికి ఎంతో ప్రయత్నిస్తేగాని కంటి నిండా నిద్రరావడంలేదు. నాలుగు గోడల మధ్య ఉన్న మనకే ఇలాంటి సమస్య ఉంటే, సరిహద్దుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే సైనికుల మాటేమిటి? అందుకోసమే సైనికులు క్షణాల్లో నిద్రలోకి జారిపోయేలా పరిశోధనలు చేశారు పరిశోధకులు. ఫలితంగా ఈ సైనిక నిద్ర అనే పద్ధతిని కనిపెట్టారు. దీని అనుసరిస్తే ఈజీగా కేవలం రెండు నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి చేరిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్ర రుగ్మతలపై పరిశోధనలు చేసి ఆయా సమస్యలకు చికిత్సను అందించే డాక్టర్ బ్రియాన్ కూడా ఈ సైనిక నిద్ర పద్ధతి వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని వివరిస్తున్నారు. 2017లో National Center for Complementary and Integrative Health ప్రచురితమైన "Sleep and Relaxation Techniques for Military Personnel" అధ్యయనంలో తేలింది. అనేక ప్రయోగాల ఫలితమైన ఈ టెక్నిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ 'మిలిటరీ ట్రిక్కు' ఏంటో మనం తెలుసుకుందాం.
ఈ మిలిటరీ స్లీప్ ట్రిక్ ప్రకారం ముందుగా కళ్లు మూసుకొని.. రెండు చేతులను పక్కన ఉంచి, గుండెలనిండా నెమ్మదిగా శ్వాస తీసుకంటూ వదలాలట. ఆ తర్వాత భుజాలను, చేతులను వదులు చేయాలని తెలిపారు. అనంతరం శరీర కండరాలన్నీ రిలాక్స్ అయ్యేలా విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లాలని.. ఫలితంగా ఒత్తిడి క్రమేపీ తగ్గుతూ వస్తుందని వివరిస్తున్నారు. ఆ తర్వాత మనసును ఊహాజనితమైన ప్రపంచంలోకి తీసుకెళ్లాలని నిపుణలు సూచిస్తున్నారు. నిశ్శబ్ద వాతావరణంలో ఒంటరిగా నీలాకాశం కింద గడ్డి మైదానంలో పడుకున్నట్లు లేదా చీకటిగదిలో ఊదావర్ణం ఊయలలో ఊగుతున్నట్లు ఊహించుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఓ రిలాక్సేషన్ టెక్నిక్‌గా మారి ప్రతికూల ఆలోచనలను తొలగించడంలో మనసుకు సహాయపడుతుందని చెబుతున్నారు. ఫలితంగా హాయిగా నిద్రపోతారని అంటున్నారు.
ఈ మిలిటరీ స్లీప్ ట్రిక్ వల్ల క్షణాల్లో కునుకు మనల్ని చేరుతుంది ఒలింపిక్ స్ప్రింట్ కోచ్ బడ్‌వింటర్ కూడా చెబుతున్నారు. ఇంకా ఈ పద్ధతిని నేవీ ప్రీ-ఫ్లైట్ స్కూల్‌లో ఈ టెక్నిక్‌ను ఓ పాఠ్యాంశంగానూ చేర్చారు. ఇంకా ముఖ్యంగా గాఢంగా శ్వాస తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారి, హృదయ స్పందన రేటును నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిద్రకు కారణమైన సహజ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతుందని వివరిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రాత్రి నుంచే ఈ మిలిటరీ ట్రిక్కుని పాటించి హాయిగా నిద్రపోవడానికి ట్రై చేద్దాం!
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ తలస్నానం చేయొచ్చా? హెడ్ బాత్కు ముందు, తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలట!
యూరిక్ యాసిడ్ ఎక్కువై ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ పాటిస్తే 'గౌట్' తగ్గిపోతుందట!