ETV Bharat / health

పండ్లు తినడం మంచిదే- కానీ ఎలా పండించారో తెలుసుకోవడం మస్ట్​- ఒక్క చూపుతోనే గుర్తించండిలా! - How To Find Natural Fruits - HOW TO FIND NATURAL FRUITS

How To Find Natural Fruits : ఆరోగ్యంగా ఉండాలనే తపనతో రోజూ పండ్లు తింటుంటాం. కానీ మీరు తినే పండ్లు సహజంగా, లేక రసాయనాలతో కృత్రిమంగా పండించినవా తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకోవాలో ఈస్టోరీలో చూద్దాం

How To Find Natural Fruits
How To Find Natural Fruits (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : May 29, 2024, 6:39 AM IST

How To Find Natural Fruits : పండ్లను నేరుగా తిన్నా, జ్యూస్​లు, డిలైట్స్ వంటివి చేసుకుని తిన్నా ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలను అందిస్తాయి. కానీ మీరు తినే పండ్లు నిజంగా ఆరోగ్యకరమైనవేనా వాటి ద్వారా మీరు పోషకవిలువలను పొందుతున్నారా లేక రసాయనాలకు బలి అవుతున్నారా అనేది తెలుసుకోవాలి. భారతదేశంలో తాజా పండ్లకు డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో దొరికే పండ్లన్నీ సహజంగా పండినవి కాదు. చాలా వరకూ వాటిని రసాయనాలతో, కృత్రిమంగా పండించి విక్రయిస్తున్నారు. ఇవి రుచిలో, రంగులో ఎక్కడా తగ్గకుండా కనిపించినప్పటకీ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

మనం మార్కెట్లో తెచ్చుకునే కొన్ని పండ్లను కార్బైడ్​తో పండిస్తున్నారు. నిగనిగలాడే మరికొన్ని పండ్లలో ఆర్సెనిక్, భాస్వరం వంటి రసాయనాల జాడలుంటాయి. పండ్లు త్వరగా పక్వానికి రావడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వీటి కారణంగా పండు రుచి ఆకారం రెండింటిలో పెద్ద తేడా కనిపించనప్పటికీ వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు, చర్మ అలెర్జీలు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. వీటిని గుర్తించి దూరంగా ఉంటే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. కృత్రిమంగా పండ్లను గుర్తించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

కృత్రిమంగా పండిన పండ్లను కంటి చూపుతో గుర్తించడం ఎలా?

రంగు : సహజంగా పండిన పండ్లు చూడటానికి అందంగా, అంతా ఒకే రంగులో ఉంటాయి. అదే కృత్రిమంగా పండిన పండ్లు కొన్ని చోట్ల ఆకుపచ్చ, మరి కొన్ని చోట్ల పండినట్లుగా కనిపిస్తాయి.

ఏకరూపత : సహజమైన పండ్లు అరుదుగా ఒకే విధంగా కనిపిస్తాయి. కృత్రిమంగా పండినవి ఏకరీతిగా కనిపిస్తాయి.

మచ్చలు : పండ్లపై మచ్చలు కనిపించినా అసహజమైన మెరుపుతో కనిపించినా వాటిని కొనకుండా ఉండటమే ఉత్తమం.

సువాసన : సహజంగా పండిన పండ్లు చక్కటి ఆహ్లాదకరమైన సువాసన కలిగి ఉంటాయి. అదే కృత్రిమంగా పండినవి పెద్దగా వాసన వెదజల్లవు, అసాధారణంగా వాసన కలిగి ఉంటాయి.

దృఢత్వం : సహజంగా పండిన పండ్లతో పోలిస్తే కృత్రిమంగా పండిన పండ్లు చాలా త్వరగా మృదువుగా, మెత్తగా మారతాయి.

రుచి : సహజంగా పండిన పండు ఎప్పుడూ సమతుల్య రుచి కలిగి ఉంటుంది. కృత్రిమంగా పండినవి అయితే ఎక్కువ తీయగా లేదా చప్పగా ఉంటాయి. ఈసారి మీరు పండ్లు కొనేముందు ఈ విషయాలను గమనించి ఆచూ తూచీ కొనండి. ఆరోగ్యంగా ఉండండి.

మీ పిల్లలకు ఎలాంటి ఆహారం పెడుతున్నారు? వీటితో డైట్​ ప్లాన్​ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు! - Diet Tips For Kids

పెదవులు జీవం కోల్పోయాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సూపర్ లిప్స్ మీ సొంతం! - Tips for Natural Pink Lips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.