ETV Bharat / health

రాగులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు- A టు Z రోగాలకు సంజీవని! - Health Benefits Of Ragi

Health Benefits Of Ragi : వేసవి వచ్చేసింది. ఈ కాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే పలు ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాగుల గురించి. వీటిని తరచూ మన డైట్​లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య లాభాలున్నాయి. మరి ఆ బెనిఫిట్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Benifits Of Ragi
Benifits Of Ragi
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 6:22 AM IST

Health Benefits Of Ragi : తృణ ధ్యాన్యాల్లో ఒకటైన రాగులను పేదవాడి ఆహారంగా చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు దీన్ని పేదవాళ్లు కాదు పెద్ద పెద్ద వాళ్లు కూడా ఏరి కోరీ తెచ్చుకుని క్రమం తప్పకుండా తింటున్నారు. ఇందుకు కారణం రాగులు తినడం వల్ల కలిగే లాభాలనే చెప్పవచ్చు. ఐరన్​, క్యాల్షియం లాంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగిన వీటిని తినడం వల్ల భయంకరమైన అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. దీంట్లో ఫైబర్​ సమృద్ధిగా ఉండటం వల్ల అసంతృప్త కొవ్వులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

రాగుల పిండితో జావ చేసుకోవడం, దోసలు వేసుకోవడం వల్ల చాలా రకాల బ్రేక్​ఫాస్ట్​లను తయారు చేసుకొని తినవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి రాగులు చక్కటి ఆహార పదార్థమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాగులను మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకుని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.

బరువు తగ్గడం
రాగుల్లో అధికంగా లభించే ఫైబర్​ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మిమ్మల్ని అతిగా తినకుండా ఆపుతుంది. చాలాసేపటి వరకు మీ కడపును నిండుగా ఉంచుతుంది. ఫిట్​నెస్​ ప్రియులు, ఉబకాయం సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.

గుండె పదిలం
రాగి పిండిలో పుష్కలంగా లభించే మెగ్నీషియం, పొటాషియంలు గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రాగుల్లో ఉండే ఇతర ముఖ్యమైన పోషకాలు కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుని శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాలు తగ్గుతాయి.

డయాబెటిస్‌ నివారిణి
రాగులను తరచుగా తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే రాగుల్లో ఫైబర్​ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.

జీర్ణక్రియకు తోడ్పాటు
రాగుల్లోని ఫైబర్​ మీ జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. దీంతో పాటు అరుగుదల సమస్యలు, మలబద్ధకం, కడుపుబ్బరం లాంటి ఇతర జీర్ణ రుగ్మతలను నయం చేస్తాయి. రాగులు పేగుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ చక్కగా ఉపయోగపడతాయి.

ఎముకలకు బలం
పాల పదార్థాలతో పోలస్తే రాగిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవటంలో కాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. రాగిజావ లేదా రాగితో చేసిన ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం వల్ల ఎములకల్లో బలం పెరుగుతుంది. అలాగే బోలు ఎముకలు లాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు చాలా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పుచ్చకాయ తింటే పురుషుడి సెక్స్ సామర్థ్యం పెరుగుతుందట- అసలేం సంబంధం? - Watermelon For Men Benefits

ఈ ఫుడ్స్​తో పోలిస్తే కోడిగుడ్డు నథింగ్ - ఫుల్​ ప్రొటీన్ - మీ కండరాలు యమా స్ట్రాంగ్ అవుతాయ్! - Best Muscle Building Foods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.