Health Benefits Of Lemon Water In The Morning : నిమ్మరసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల మన రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. అందుకే దినచర్యలో నిమ్మరసాన్ని భాగంగా చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. ప్రత్యేకించి రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే మంచిదని అంటారు. దీనివల్ల ఇంకా ఎన్నెన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
రోగ నిరోధక వ్యవస్థకు బలం
నిమ్మకాయల్లో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సీ వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తాగితే జలుబు, ఇన్ఫెక్షన్లు దరి చేరవు. ఇది ఏడాది పొడవునా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సీ అనేది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీర కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
జీర్ణక్రియకు దోహదకరం
నిమ్మరసం మన జీర్ణవ్యవస్థను కండీషన్‌లో ఉంచుతుంది. ఇది మన కడుపులో యాసిడ్ ఉత్పత్తి, పిత్త స్రావాన్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. ప్రేగుల కదలికలు మెరుగవుతాయి. ఉబ్బరం, ఛాతీలో మంట వంటి అజీర్తి లక్షణాలను తగ్గిస్తుంది.
శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది
మన శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటే ఆరోగ్యవంతంగా ఉండగలదు. నిమ్మరసం తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా తయారవుతుంది. చర్మంపై నిగారింపు కూడా వస్తుంది. అంటే మన చర్మ సౌందర్యాన్ని కూడా నిమ్మరసం ఇంప్రూవ్ చేయగలదు.
బరువు తగ్గడానికి దోహదకరం
బరువు తగ్గాలని భావించే వారు నిమ్మరసం తప్పకుండా తాగాలి. తొలుత మన జీవక్రియలను ఇది క్రమబద్దీకరిస్తుంది. తదుపరిగా మనం ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి. నిమ్మరసం తాగుతూ ఇవి కూడా ఫాలో అయితే వెయిట్ లాస్ జరుగుతుంది. రోజూ కొంత సమయాన్ని తేలికపాటి వ్యాయామానికి కేటాయిస్తే ఈ దిశగా మంచి ఫలితాలు వస్తాయి.
చర్మ ఆరోగ్యం
నిమ్మరసంలో ఉండే విటమిన్ సీ వల్ల మన చర్మ ఆరోగ్యం మెరుగు అవుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసం తాగితే మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. ఫైనల్‌గా మనకు మెరిసే ఛాయ కలిగిన చర్మం సొంతం అవుతుంది. నిమ్మరసం తాగితే చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది.
శ్వాసను ఫ్రెష్ చేస్తుంది
నిమ్మరసం తాగితే మన శ్వాసలో తాజాదనం వస్తుంది. నిమ్మరసంలో ఉండే ఆమ్లత్వం మీ నోటిలోని బ్యాక్టీరియాను చంపేసి నోటి దుర్వాసన సమస్యను మటుమాయం చేస్తుంది. మన దంతాల ఎనామిల్‌ను రక్షించడానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది.
శక్తి స్థాయుల్లో పెరుగుదల
నిమ్మకాయ సువాసనతో మీ మానసిక స్థితి, శక్తి స్థాయులు పెరుగుతాయి. ఉదయాన్నే నిమ్మరసం తాగితే రోజంతా మీరు జోష్‌గా ఉండటానికి గొప్ప ఆరంభం లభిస్తుంది. మీ ఏకాగ్రతా శక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది.
పీహెచ్ స్థాయులు బ్యాలెన్స్
నిమ్మరసం మన శరీరంపై ఆల్కలైజింగ్ ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మన పీహెచ్ స్థాయులు సమతుల్యం అవుతాయి. మొత్తం ఎసిడిటీని తగ్గిస్తుంది. నిమ్మరసం వల్ల మన శరీరంపై ఏర్పడే ఆల్కలైజింగ్ ప్రభావంతో శరీరంలో ఎక్కడైనా వాపులు ఉంటే తగ్గుతాయి.
శరీరం డీటాక్సిఫై
నిమ్మరసం తాగితే మూత్రవిసర్జన సాఫీగా జరుగుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్‌ను మూత్రం ద్వారా బయటికి పంపడంలో నిమ్మరసం కీలక పాత్ర పోషిస్తుంది. మన కాలేయం పనితీరు మెరుగవుతుంది. రెగ్యులర్‌గా నిమ్మరసం తాగితే మన శరీర వ్యవస్థ శుభ్రంగా, సవ్యంగా ఉంటుంది. సరైన పనితీరును కనబరుస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
నిమ్మరసంలో పొటాషియం, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి . పొటాషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. విటమిన్ సీ మనల్ని హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. నిమ్మరసం క్రమం తప్పకుండా తాగితే రక్తపోటు(బీపీ) తగ్గుతుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.