ETV Bharat / health

మీ జుట్టు తీవ్రంగా రాలుతోందా? - తమలపాకుతో ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందట! - BENEFITS OF BETEL LEAVES

- ఎన్నో ఔషధ గుణాల కలయిక తమలపాకు - రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదంటున్న నిపుణులు

Health Benefits Of Betel Leaves
Health Benefits Of Betel Leaves (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 27, 2024, 1:58 PM IST

Health Benefits Of Betel Leaves : ఇంట్లో పూజలు, శుభకార్యాలు చేసినప్పుడు ముత్తైదువులకు వాయనమివ్వడానికి పూలు పండ్లతోపాటు తమలపాకులూ ఉపయోగిస్తారు. సంప్రదాయం ప్రకారం ఇలా నోములు, వ్రతాల్లో తమలపాకులు లేనిదే తాంబూలం పూర్తికాదు. ఎక్కువ మంది వీటిని పాన్‌లానూ ఉపయోగిస్తారు. ఒకప్పుడు విందు భోజనాల్లో తమలపాకు, వక్క, సున్నం కలిపి కిల్లీ తప్పనిసరిగా అందించేవారు. కానీ, ఇటీవల కాలంలో ఎక్కువ మంది ఇవి తినడానికి ఆసక్తి చూపించడం లేదు. అయితే, తమలపాకు రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

గుండె ఆరోగ్యంగా :

తమలపాకులో ఉండే యూజెనాల్‌ కాలేయంలో కొవ్వుశాతం పెరగకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయుల్ని నియంత్రించడంలోనూ సహాయపడుతుంది. ఫలితంగా గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

ఒత్తిడి దూరం :

వీటిలో ఫెనోలిక్‌ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో కాటెకోలమైన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తికి సహాయపడతాయి. దాంతో ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.

ఆస్తమా నివారణకు :

తమలపాకుల్లో యాంటీహిస్టామైన్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తమా, కాలనుగుణ అలర్జీలతో బాధపడేవాళ్లు తరచూ ఈ రసాన్ని తాగడం లేదా ఆకుల్ని నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే శ్వాసకోస ఇబ్బందులతో బాధపడే వారు తమలపాకులు నమలడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకం తగ్గుతుంది :

నేటి ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ మంది జీర్ణసంబంధిత సమస్యలు, మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, తమలపాకుల్లో ఉండే పాలీఫెనాల్స్, చవికోల్‌ క్రిమినాశకాలుగా పనిచేస్తాయి. తరచూ తమలపాకులు తినడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.

యాంటీ-డయాబెటిక్ :

తమలపాకుల్లో రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించే లక్షణాలున్నాయి. ఈ పొడిని కలబంద, ఉసిరి రసాల్లో కలిపి తీసుకుంటే బ్లడ్​లో ఉండే గ్లూకోజ్‌ స్థాయుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అలాగే ఈ తమలపాకులు వేసుకోవడం వల్ల నోటి పరిశుభ్రత బాగుంటుంది. వీటిలో యాంటీ-డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అల్సర్, యాంటీ-క్యాన్సర్ వంటి అనేక లక్షణాలున్నాయని National Institutes of Health (NIH) నిపుణుల బృందం వెల్లడించింది. (రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి).

  • తమలపాకుల్లో సి విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. జుట్టురాలడం, చుండ్రు సమస్యలతో బాధపడేవారు మందార ఆకుల్ని, వీటిని పేస్టులా చేసి జుట్టుకి మాస్క్‌లా వేసుకోవచ్చు. దీంతో కురుల పెరుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.
  • డైలీ వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే.. వీటిలో ఉండే యాంటీ ఫంగల్‌ గుణాలు ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి:

"గ్యాస్​ ట్రబుల్​ నుంచి బీపీ దాకా - ఎన్నో సమస్యలకు ఈ ఫ్రూట్​తో చెక్"!

బరువు తగ్గడం నుంచి షుగర్​ కంట్రోల్​ వరకు - నల్ల జీలకర్రతో అద్భుత ప్రయోజనాలట! - ఎలా తీసుకోవాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.