Hair Tips In Rainy Season : వర్షాకాలం వస్తూ వస్తూనే.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లను వెంట తీసుకొస్తుంది. అంతేనా.. వీటితోపాటు జుట్టు రాలిపోవడం, చుండ్రు, పొడిబారడం, జుట్టు చింపిరిగా మారి చిక్కులు పడడం వంటి సమస్యలనూ పెంచుతుంది. కాబట్టి.. సీజన్‌కు అనుగుణంగా మనం కొన్ని అలవాట్లను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే.. హెయిర్ ప్రాబ్లమ్స్ తప్పవని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువగా నూనె పెట్టుకోకూడదు!
వర్షాకాలంలో మాడుపైన ఎక్కువగా ఆయిల్ ఉత్పత్తి అవుతుందట. కాబట్టి, ఈ సీజన్‌లో ఎక్కువగా ఆయిల్ పెట్టుకోకూడదని.. వారానికి రెండు లేదా మూడు సార్లు రసాయనాలు లేని షాంపూతో తలస్నానం చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల జుట్టుపైన ఉన్న మురికి తొలగిపోతుందని చెబుతున్నారు. అలాగే జుట్టు దెబ్బతినకుండా కండీషనర్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
తల స్నానం చేసిన మరుసటి రోజుకే - జుట్టు గడ్డిలా తయారవుతోందా?
ఆ దువ్వెనతో..
వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా చిక్కులు పడుతుంటుంది. అయితే, ఇలాంటప్పుడు మామూలు దువ్వెనతో దువ్వుకోవడం వల్ల హెయిర్‌ఫాల్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. ముందుగా తలస్నానం చేశాక కండిషనర్ రాసుకోవాలి. ఒకవేళ ఈ అలవాటు లేని వారు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు బ్రిజిల్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉన్న దువ్వెన తీసుకొని కుదుళ్ల వద్ద నుంచి చివర్ల దాకా దువ్వుతూ రావాలని సూచిస్తున్నారు. ఇలా దువ్వుతున్నప్పుడు ఎక్కడైనా చిక్కులు కట్టినట్లు అనిపిస్తే వేళ్లతో వాటిని తొలగించాలి. చిక్కులన్నీ తొలగిపోయాక.. మరోసారి హెయిర్‌ను పైనుంచి కింది వరకు దువ్వుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.
మైక్రోఫైబర్ టవల్ ఉపయోగిస్తే మేలు :
ఈ సీజన్‌లో జుట్టు అధికంగా రాలే వారు సాధారణ టవల్‌కు బదులుగా మైక్రోఫైబర్ టవల్‌ను ఉపయోగిస్తే మంచిదని సూచిస్తున్నారు. వీటితో తలస్నానం చేసిన తర్వాత బలంగా రుద్దకుండా.. పైనపైన తుడుచుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఈ టవల్ వాడటం వల్ల కుదుళ్లు దెబ్బతినకుండా ఉంటాయని పేర్కొన్నారు.
2019లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. మైక్రోఫైబర్ టవల్స్ ఉపయోగించిన వారిలో.. సాధారణ టవల్స్ ఉపయోగించిన వారి కంటే తక్కువ జుట్టు రాలిపోయిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెర్మటాలజీస్ట్ 'డాక్టర్ జాన్ స్మిత్' పాల్గొన్నారు. జుట్టు రాలడంతో బాధపడేవారు మైక్రోఫైబర్ టవల్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వాటితో జాగ్రత్త :
కొంతమంది హెయిర్ డ్రయర్, స్ట్రెయిట్నర్ వంటి టూల్స్‌ని ఉపయోగిస్తుంటారు. ఇలాంటివారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హెయిర్‌ని కాపాడుకోవడానికి హీట్ ప్రొటెక్టంట్ తప్పనిసరిగా ఉపయోగించాలి. లేకపోతే కుదుళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
అలర్ట్ : వర్షాకాలం మీ కళ్లకు ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్స్ సోకే ఛాన్స్ - ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
జలుబు చేసినప్పుడు ముక్కు కారడం ఆగట్లేదా? - ఇలా చేశారంటే బిగ్ రిలీఫ్!